టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆడియన్స్‌ను పలకరించనుంది. అది కూడా పవన్ ఏపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ఇక టాలీవుడ్‌లోనూ పెద్ద హీరో సినిమా రిలీజై ఎన్నో నెలలు గడిచిపోయింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశానికి అంటుకున్నాయి. వీరమల్లు టీం సైతం.. సినిమాకు ఏ పోటీ లేకుండా చాలా ప్రశాంతంగా రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఇ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మెజార్టీ థియేటర్లలో వీరమల్లునే ఆడబోతుంది. 80 నుంచి 90% మధ్య ధియేటర్లలో వీరమల్లును రిలీజ్ చేయనన్నారు. చిన్న టౌన్స్‌లో అయితే దాదాపు దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లో వీరమల్లునే రిలీజ్ చేయనున్నారు.
ఫస్ట్ 100% థియేటర్లలో మెజారిటీ షోలు వీరమల్లు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో మెగా హీరోలకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఆ ఏరియాలో వసూళ్లు కూడా భారీ లెవెల్లో ఉంటాయి. పవన్ సినిమాలకు క్రేజీ లెవెల్లో ఓపెనింగ్ జరుగుతాయి. దీంతో వీరమల్లును అక్కడ 150 థియేటర్లు ఉంటే.. 135 థియేటర్లలో ప్రదర్శించనున్నారట. ఇక నెక్స్ట్ వీకెండ్ కు ఆంధ్ర లోను ఇదే స్థాయిలో వీరమల్లు రిలీజ్ అవుతుంది. వేరే వాళ్లకు పోటీగా వచ్చే వారం మరో సినిమా రిలీజ్ కావట్లేదు. ఇక గత వారంలో వచ్చిన జూనియర్, కొత్తపల్లిలో సినిమాలు ఇప్పటికే కలెక్షన్స్ వీక్ అయ్యాయి.
వచ్చేవారానికి ఈ సినిమాలు పూర్తిగా ధియేటర్ నుంచి వెళ్ళిపోతాయి. ముందు వారాల్లో వచ్చిన సినిమాలేవి ఆ సమయానికి ఉండే అవకాశం లేదు. పెద్ద సిటీల్లో మల్టీప్లెక్స్ లలో f1, సూపర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ సినిమాలు అడపా దడపా షోలు పడినా.. మిగతా షేస్ మాత్రం వీరమల్లుకే కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణలోను పవన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక్కడ కూడా సినిమా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సైతం టికెట్ ధరలో ప్రీమియర్ షోల విషయంలో పర్మిషన్స్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే పవన్ మానియాకు తగ్గట్టు సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల ఊచకోత కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.