టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా గీతాకృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. ఏ.ఏం.రత్నం ప్రొడ్యూసర్గా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆడియన్స్ను గ్రాండ్ లెవెల్ లో పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షోస్, టికెట్ ధరలపై సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో సినిమా టికెట్ రేట్ లపై సస్పెన్షన్ నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం వీరమల్లు సినిమా ప్రీమియర్స్ టికెట్ ధరల, పెంపుకు అనుమతిస్తుందా.. లేదా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే.. తాజాగా ఈ సందేహాలకు చెక్ పెడుతూ సినిమా రిలీజ్ కు ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోస్ వేసుకునేందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుమతినిచ్చింది. ముందురోజు రాత్రి షోకు టికెట్ ధర రూ.600 కు అమ్ముకోవచ్చని పర్మిషన్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ రోజు నుంచి 27 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్లపై రూ.200 పెంపుకు.. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు రూ.150 టికెట్ పెంపుకు పర్మిషన్ ఇచ్చారు.
25 నుంచి ఆగస్టు 2 వరకు.. మల్టీప్లెక్స్ టికెట్లకు రూ.150 సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో టికెట్ కు రూ.106 వరకు పెంచుకునే విధంగా తెలంగాణ గవర్నమెంట్ వీరమల్లు టీంకు పర్మిషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్లు పై భారీ పెంపుకు తెలుగు రాష్ట్రాల పర్మిషన్ ఇవ్వడంతో.. సినిమా ఫస్ట్ డేనే రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ కొల్లగొట్టి సంచలనం సృష్టిస్తుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అంటుకుంటుందో చూడాలి.