పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్‌ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మూవీ మేకర్స్ మెగా సూర్య ప్రొడక్షన్స్ ఓ అఫీషియల్ ప్రకటనను రిలీజ్ చేసింది. మీరంతా పవన్ కళ్యాణ్ గారి వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.
మీ ప్రేమ, ఆదరణ మాకు దక్కాలి. అయితే.. అందరికీ చిన్న విన్నపం. ఎవరి దగ్గర అయితే సరైన పాస్ ఉంటుందో వారిని మాత్రమే అనుమతిస్తున్నాం. ప్రతి ఒక్కరి భద్రతతో పాటు.. ఈ కార్యక్రమం సజావుగా జరగడమే మాకు ముఖ్యం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. పాస్‌లు లేని అభిమానులు దయచేసి వేదిక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకండి. హెవీ క్రౌడ్ కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ ప్రకటనలో వివరించారు. ఇక ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో పాటు.. కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే కూడా హాజరుకానున్నాడు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ లెవెల్‌లో జరుగుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
పవన్ ఎపి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడం.. కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఆడియన్స్‌లో సినిమాపై హైప్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. సింగల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో లోయర్ క్లాస్ కు రూ.100 జీఎస్టీతో కలిపి.. అప్పర్ క్లాస్ కు రూ.150 పెంచుకునే అవకాశం అందించారు. మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచేందుకు పర్మిషన్స్ దక్కాయి. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందు రోజున.. జూలై 23న రాత్రి 9 గంటలకు పేయిడ్ ప్రీవియరస్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ టికెట్ ధర రూ.600 కాగా.. జీఎస్టీ అదనంగా మేకర్స్ నిర్ణయించారు.