పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణగతొక్కి సినిమా భారీ హైప్‌తో స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అనే నమ్మకంతో ఉన్నాయి. మరోసారి బాక్సాఫీస్ కళకళలాడడం ఖాయం అంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు సినిమా ఎలాంటి అంచనాలు లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు నూతన ఉత్సాహాన్ని నింపే ఓ క్రేజి అప్డేట్ మేకర్స్ షేర్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్ షోస్ ఉంటాయని వెల్లడించారు.
నిన్న సాయంత్రం దీనిపై అఫీషియల్ జీవో రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ లో ఆనందంకి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాదు.. ఆంధ్రలోనూ ఇతర ప్రదేశాల్లో పలు సెలెక్టివ్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయాయి. విజయవాడలో ఎనిమిది గంటల ఆటకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌ని అలంకార్, జయరాం థియేటర్స్‌తో ప్రారంభించారు. కేవలం పది నిమిషాల్లో ఈ రెండు థియేటర్లో టికెట్స్ హార్ట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అలాగే.. డిస్ట్రిక్ట్ యాప్‌లో క్యాపిటల్ సినిమాస్‌లో రెండవ రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఆశ్చర్యం ఏంటంటే.. రెండో రోజు బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగాయి. దాదాపు అన్ని టికెట్స్ అమ్ముడుపోవడం విశేషం. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెడితే.. నిమిషాల వ్యవధిలో టికెట్స్ హార్ట్ కేకుల్లా అమ్ముడవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రీమియర్ షోస్‌కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్‌లో జోరుగా కొనసాగుతుంది. అయితే.. ఇప్పుడే సినిమా హైప్ ఎలా ఉందో మాత్రం చెప్పడం కష్టమే. కేవలం ఒకటి రెండు థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్‌తో సినిమా రిజల్ట్ ఎవరు చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జీవో వచ్చేసిన నేడు పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రీమియర్ షోస్ కంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ షోస్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సి సెంటర్స్ లో బుకింగ్ పెదగా జరగకపోవచ్చు. ఈ క్రమంలోనే నేటి నుంచి సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలకు చాలా కాలం తర్వాత ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ప్రీమియర్ షోస్‌తో పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు నెక్స్ట్ లెవెల్‌లో బజ్ క్రియేట్ అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తుందని నమ్మకం అభిమానితో పాటు.. ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.