టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఆయన కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా మధ్యలో జ్యోతి కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జట్‌తో వీరమల్లును తెరకెక్కించాడు. మరో నాలుగు రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న క్రమంలో వీరమల్లు సినిమాకు బిగ్ షాక్ తగిలినట్టు అయింది. తాజాగా.. వీరమల్లు సినిమాకు పెద్ద కష్టం వచ్చి పడిందంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. నిర్మాత ఏ.ఏం.రత్నం గతంలో బంగారం, ముద్దుల కొడుకు, ఆక్సిజన్ లాంటి సినిమాల వల్ల భారీ నష్టాలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే బాకీ పడ్డారు కూడా. దీంతో ఆ బాకీలను భర్తీ చేయాలంటే ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు లేకలు రావడం రత్నంకు బిగ్ షాక్ తగిలింది. ఈ లేఖలో ఆక్సిజన్ సినిమాకు గాని రూ.260 కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని రికవరీ చేయాలంటూ శ్రీ సూర్య మూవీస్ పై డిస్టిబ్యూటర్స్ ఫిర్యాదు చేయగా.. బంగారం, ముద్దుల కొడుకు సినిమాలకు రూ.90 లక్షల బ్యాలెన్స్ రేఫండబుల్ ఇవ్వాలంటూ మహాలక్ష్మి ఫిలిమ్స్ రత్నంపై మరొక ఫిర్యాదును చేసింది.
ఈ పరిణామాలను చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు.. ఈ విషయాన్ని ఫుల్ సీరియస్ గా తీసుకున్నట్లు క్లారిటీ వస్తుంది. దీన్ని పరిష్కారం చేసే విషయంపై ఫిలిం ఛాంబర్‌లో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరాడట. అలాగే.. నైజంలో వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందే ఈ డబ్బును తిరిగి ఇచ్చేలా హెల్ప్ చేయాలంటూ తాము అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మరి ఏ.ఏం.రత్నంపై వచ్చిన ఈ ఫిర్యాదులపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో.. నైజంలో వీరమల్లు సినిమా రిలీజ్‌కు ఎన్ని తంటాలు పడాలో.. అసలు రిలీజ్ అవుతుందో.. లేదో అని టెన్షన్ ఫ్యాన్స్ లో మొదలైంది.