టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఓ సినిమాను బెనిఫిట్ షోను చూసి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎప్పుడో అజ్ఞాతవాసి సినిమాలో ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్.. ఆ తర్వాత పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయిన ఒక్క సినిమాను కూడా బెనిఫిట్ షోస్ అందించలేకపోయారు. కారణం.. జగన్ ప్రభుత్వం. వకీల్ సాబ్ సినిమాకు భారీ బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసినా.. చివరి నిమిషంలో గవర్నమెంట్ దానికి అనుమతి ఇవ్వకపోవడం. అలాగే.. టికెట్ రేట్లను సైతం భారీగా తగ్గించి ఉత్తర్వులు జారీ చేయడంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన భీమ్ల నాయక్, బ్రో సినిమాలకు సైతం ఇదే పరిస్థితి. కేవలం పవన్ సినిమాలకు మాత్రమే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కనిపిస్తూ ఉండేవి. మిగిలిన అన్ని సినిమాలకు అందరూ హీరోలకు అన్ని రకాల బెనిఫిట్స్‌తో సినిమాలు రిలీజ్ అయ్యేవి.
అభిమానులు వీటిపై ఎంతో నిరాశ వ్యక్తం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. ఈ నెల 26న వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. పవన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ డిప్యూటీ సీఎం. ఇక ఆయన సినిమా అంటే ఫార్మాలిటీ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ.. చిటిక వేసినట్లు క్షణాలు అన్ని పర్మిషన్స్ తెచ్చుకోవచ్చు. ఈ క్రమంలోనే కొద్ది గంటల క్రితం నిర్మాత ఏ.ఏం.రత్నం మీడియాతో ఇంట్రాక్టై రెండు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోస్‌ని ప్లాన్ చేస్తున్నామని.. ప్రభుత్వాలకు అప్లికేషన్లు కూడా పెట్టామని.. త్వరలోనే జీవో వచ్చేస్తుందంటూ వివరించాడు. ఈ న్యూస్ తెలియగానే అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత.. మా ఫేవరెట్ హీరో ప్రీమియర్ షోస్ చూడబోతున్నాం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేస్తుందో.. లేదో అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ పేరిట ఆల్ టైం రికార్డ్ క్రియేట్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రూ.75 కోట్ల షేర్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పాజిటివ్ టాక్ వస్తే.. ఈ రేంజ్ వసూళ్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ కాకపోయినా.. టాప్ 2లో అయినా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని బలంగా నమ్ముతున్నారు. అంటే నిర్మాత రత్నంకు సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరేళ్ల నుంచి ఎంతగానో కష్టపడి సినిమా కోసం ప్రాణం పెట్టి మరి పనిచేస్తున్నారు రత్నం. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో.. ఏ రేంజ్‌లో లాభాలను కొల్లగొడతాడు చూడాలి.