టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కెరీర్‌లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వీరమల్లు రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్‌లో హైప్ నెలకొంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక క్రిష్ డైరెక్షన్‌లో ప్రారంభమైన వీరమల్లు.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను చూసేందుకు లక్షలాదిమంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా తాజాగా ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారం బుక్ మై షో లో ఈ సినిమా క్రేజి రికార్డ్ క్రియేట్ చేసింది. మూవీకి ఇప్పటికే ఉన్న హైప్‌తో భారీ ఇంట్రెస్టింగ్ రేటింగ్ నమోదయింది. ఏకంగా 3 లక్షలకు పైగా వీక్షకులు సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం విశేషం.
ఒక హిస్టారికల్ మైథాలజికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే సినిమా చూసేందుకు ఈ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు అంటే అది సాధారణ విషయం కాదు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా, ఏ.ఎం.రత్నం ప్రొడ్యూసర్గా వ్యవహరించినన్నారు. ఇప్పటికే ఆడియన్స్‌లో ఈ మూవీ పై పీక్స్ లెవెల్ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఏ రేంజ్‌లో రికార్డ్‌లు క్రియేట్ చేస్తుందో.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.