టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. మరో ఆరు రోజుల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో చేస్తున్నాడు ప్రొడ్యూసర్ ఏ. ఎమ్. రత్నం. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో బాబీ డియోల్ విలన్ గా, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
అయితే పవన్ గత సినిమాల టికెట్ ధరల విషయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూసాం. కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమా ఓపెనింగ్స్ లెక్కలు నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరమల్లు సినిమాకు వచ్చే హైక్స్ పై ఇప్పటినుంచి హైప్ మొదలైంది. ఇక ఇప్పటికే వీరవల్లి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.135 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. దానికి తగ్గట్లుగానే టికెట్ రేట్లు కూడా ఉండనున్నాయట.
దీని ప్రకారం ఏపీలో సింగిల్ స్క్రీన్ హైయెస్ట్ టికెట్ కాస్ట్ రూ.250 నుంచి.. మల్టీప్లెక్స్‌లకు రూ.295 వరకు ఉండవచ్చని సమాచారం. అలాగే తెలంగాణ సింగల్ స్క్రీన్‌కి యావరేజ్‌గా రూ.265 నుంచి.. మల్టీప్లెక్స్‌కి రూ.413 వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇదే కాస్ట్ లో టికెట్లు కొన్ని రోజులు విక్రయించనున్నారని.. తర్వాత టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే.. దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న మేకర్స్.. జులై 24న ఈ సినిమాతో ఏ రేంజ్‌లో సందడి చేయనున్నారో చూడాలి.