టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు మరో 10 రోజుల్లో ఆడియోస్ పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అలాగే పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమానై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే.. తాజాగా సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కార్యక్రమాలను సైతం ముగించుకుంది. ఇక సెన్సార్ సభ్యులు సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కాగా సినిమా 2 గంటల 42 నిమిషాల 40 సెకండ్లు రన్ టైంతో రానుందట. పెద్దగా కట్స్ లేకుండా సినిమాను సర్టిఫై చేశారట సెన్సార్ టీం. ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా.. లేదా.. అనే సందేహాలు నిన్న మొన్నటి వరకు ఆడియన్స్ లో ఉన్నా.. ఎట్టకేలకు వాటన్నిటికీ సెన్సార్ చెక్ పెట్టింది. ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యుల రివ్యూ ప్రకారం.. సినిమా అదిరిపోయిందట. ఇటీవల కాలంలో ఇలాంటి గ్రాండ్ ఇయర్ లుక్ ఇచ్చిన సినిమాను చూడలేదని.. ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్.. హై మూమెంట్స్ తో, చాలా రిచ్ నెస్‌తో రూపొందిందని.. పవన్ అభిమానులకు సినిమా ఫస్ట్ ఆఫ్ తో పూనకాలు కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్ గా చాలా ఆకట్టుకుంటుందని.. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నెక్సట్ లెవెల్లో తర్కెక్కిందని చెబుతున్నారు.
ఇక సినిమాలో హైలెట్స్ విషయానికొస్తే.. పవన్ ఇంట్రడక్షన్ ఫైట్, కోహినూర్ డైమండ్ ని దొంగిలించే సీన్, కుస్తీ ఫైట్, చార్మినార్ ఫైట్, ఫ్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశాలన్నీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని.. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఫైట్ సీన్స్ మరింత అదిరిపోయాయని అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత ఫ్యాన్స్‌లో ఉత్సాహం డబల్ అవుతుందని.. థియేటర్ యాజమాన్యాలు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటూ ఆ రేంజ్ లో సినిమా రాబోతుందని సెన్సార్ వివరించాతట. సెన్సార్ సభ్యులు చెప్పిన రేంజ్లో మూవీ టాక్ వస్తే మాత్రం వీరమల్లు బాక్స్ ఆఫీస్ భీభత్సం కాయం.