టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది మెల్లమెల్లగా హీరో అవకాశాలు తగ్గిపోతున్న క్రమంలో కీలక పాత్రలో సైతం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ఆరు పదుల వయసు దాటిన తర్వాత ఇంకా హీరోల డ్యూయెట్లు చేస్తామంటే ఆడియన్స్ కు నచ్చకపోవచ్చని భావిస్తున్నారు ఎంతోమంది హీరోలు. ఇదే కోవలో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా అదే లైన్‌లోకి వచ్చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన కుబేరాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నాగార్జున.. ఈ సినిమాలో తన నటనకు ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో నాగార్జున నటించినది హీరో పాత్ర కాదు.. అలాగని అసలు విలన్ పాత్ర కూడా కానేకాదు.. పరిస్థితులు తగ్గట్టుగా తనను తను మార్చుకునే రోల్. ఇక కుబేర సినిమా తర్వాత నాగార్జున తన కథల విషయంలోను ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చాడు.
మరోవైపు రజనీకాంత్ కూలీలో ఆయన విలన్‌గా మెరవనున్నాడు. ఇలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జున పై మండిపడుతున్నారు. లోకేష్ కనకరాజ్ రచయితగా తెరకెక్కిస్తున్న పూరీలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో స్టోరీ మొత్తం నాగ్ లీక్ చేసేసాడంటూ సోషల్ మీడియాలో రజనీకాంత్ మండిపడుతున్నారు. కూలీ సినిమాలో విలన్ తనకు, రజిని కాంబోలో సీన్స్ అదిరిపోతాయని.. అమీర్ క్లైమాక్స్ లో వస్తాడంటూ నాగార్జున ఇటీవల ఓ సందర్భంగా లీక్ చేశాడు. కూలి రిలీజ్ వరకు నాగార్జున విలన్ అన్న సంగతి మేకర్స్ దాచాలని భావించారట. కానీ.. కుబేర ఇంటర్వ్యూలో నాగార్జున దాన్ని రివిల్ చేసేసాడు. దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ నాగార్జున చేసిన పనికి ఫైర్ అవుతున్నారు. ఇక ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అదే రోజున బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ వార్ 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోని రెండు సినిమాల మధ్యన గట్టి పోటీ నెలకొంటుంది. ఇక కూలీ వర్సెస్ వార్ 2 పోరులో ఎవరు సక్సెస్ కొడతారో వేచి చూడాలి.