పవన్ ఓజి క్రేజ్.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ఓజి. ఎప్పటి నుంచో పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, మేకింగ్ వీడియోలు సినిమాపై ఆడియన్స్ లో హైప్‌ను అమాంతం పెంచేశాయి. అంతేకాదు.. పవన్ లుక్స్‌, స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్ష‌న్ అన్ని కూడా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా క‌నిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన ఫ్యాన్స్ తో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బిజినెస్ లెక్కల పై ఆసక్తి చూపుతున్నాయి.

They Call Me OG: Pawan Kalyan to join the team soon as shooting resumes - India Today

ఇక హీరోయిన్గా ప్రియాంక అరులు మోహన్ మెర‌వ‌నుంది. హై బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్‌ఆర్ఆర్ నిర్మాత దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అంచలంచలుగా పెరుగుతున్న క్రేజ్ రీత్యా.. సినిమా ధియేట్రిక‌ల్‌ బిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా.. ఏ సినిమా అయినా ఆంధ్రాలో ఒక్కో ఏరియాకు ఒక్కో పర్సంటేజ్ అని ముందే లెక్కకడతారు. టోటల్ అమౌంట్ ఎంత అని ఎస్టిమేట్ చేస్తారు. ఒక్కో ఏరియాకు ఓ పర్సంటేజ్ ప్రకారమే రేట్లు కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు మేకర్స్. అలా.. ఓజికి కూడా ఆంధ్రాలో రూ80 కోట్లు అమౌంట్‌ను ఫిక్ చేశారు. ఇందులో విశాఖకు 24%, అలాగే.. ఈస్ట్‌కు 16% వరకు రేట్ ఫిక్స్ అవ్వాలి.

Buzz: Pawan Kalyan OG does sensational pre-release business

కానీ.. సినిమాకు ఉన్న క్రేజ్, పాపులారిటీ రీత్యా.. ఈ రెండు ప్రాంతాలతో పాటు గుంటూరు ఏరియాలో కూడా రెండు నుంచి మూడు పర్సంటేజ్ అధికంగా బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంటే.. విశాఖకు 26 లేదా 27% డీల్ జరుగుతుందట. అలాగే.. ఈస్ట్ కు 16 నుంచి 18 పర్సంటేజ్ కు డీల్ పెరిగిందని.. గుంటూరులో కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. అలా ప్రస్తుతం బిజినెస్ డీల్స్ భారీగా కొనసాగుతున్న క్రమంలోనే.. ఓజి ప్రీ రిలీజ్‌ థియేట్రిక‌ల్ బిజినెస్ దాదాపు రూ.150 కోట్ల మార్కు దాటుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ కు రెండు నెలలు పైనే వ్యవధి ఉండ‌గానే ఈ రేంజ్ బిజినెస్ అంటే ఓజికి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.