టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటి సిఎం మాజీ భార్య రేణు దేశాయ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు లైఫ్.. గతంలో నాగార్జున చేసిన ఒకే ఒక్క పనితో పూర్తిగా చేంజ్ చేసిందని న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. రేణు దేశాయ్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలో బద్రి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ అమ్మడు తన నటనతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమెను తప్ప మరి ఎవరిని ఊహించుకోలేనంతగా జీవించింది. పవన్ కళ్యాణ్ రోల్ ఎంత హైలెట్ అయిందో.. రేణు దేశాయ్ పాత్ర సైతం అదే రేంజ్ లో ఎలివేట్ అయింది.
ఇక.. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలు బుల్లితరకు అతుక్కుపోయి మరి జనం వీక్షిస్తూ ఉంటారు. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథని మొదట నాగార్జునతో చేయాలని భావించాడట. డైరెక్టుగా కథను నాగార్జునకు చెప్పగా.. కొన్ని కారణాలతో నాగార్జున కథను రిజెక్ట్ చేశాడు. పూరి జగన్నాథ్ సినిమాకు నాగార్జున చేసిన నో అనే కామెంట్స్ రేణు దేశాయి లైఫ్‌ను పూర్తిగా మార్చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని కారణంగానే పవన్‌తో రేణు దేశాయ్ కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా షూట్‌లో ప్రేమలో పడి కొన్నేళ్ళ లివింగ్ రిలేషన్షిప్ తర్వాత ఈ జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక వీళ్ళిద్దరికీ ఆధ్యా, అకిరా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని దూరమయ్యారు. ఈ క్రమంలో ఒకవేళ నాగార్జున అప్పుడు పూరిజగన్నాథ్ సినిమాకు నో చెప్పకపోయి ఉండుంటే రేణు దేశాయ్, నాగ్ కాంబోలో మూవీ ఫిక్స్ అయ్యేది. పవన్ రేణు దేశాయ్ మధ్యన అసలు ఎలాంటి సంబంధమే ఉండేది కాదని.. ఆయన రిజెక్ట్ చేసిన సినిమా కథతో రేణు దేశాయ్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరో పక్క దేశాయ్ సైతం తన పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.