టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో మరో సినిమా షూట్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. దేవర పార్ట్ 2 ఎలాగూ తారక్ లైనప్‌లో ఉండనే ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మురుగన్ సినిమాలో తారక్ నటించనున్నట్లు సమాచారం. దీంతోపాటు.. నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో మరో సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇలా.. ప్రస్తుతం చేత నిండా వరుస సినిమాల లైనప్ తో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. తన సినీ కెరీర్లో ఇప్పటికే ఎన్నో ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను వదులుకున్నాడట. ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎవరైనా సరే తమ వద్దకు వచ్చిన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. అలా.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఇండస్ట్రియల్ హిట్లు గా నిలిచాయి. ఇంతకీ తారక్ రిజెక్ట్ చేసిన హిట్ సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన కిక్.
అంతేకాదు.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఆర్య, వి.వి. వినాయక్ – నితిన్ కాంబోలో తెరకెక్కిన దిల్, బోయపాటి – రవితేజ కాంబోలో వచ్చిన భద్ర, నాగార్జున – కార్తీ కాంబో మూవీ ఊపిరి. కళ్యాణ్ రామ్.. అతనొక్కడే, అల్లు అర్జున్ – చరణ్ మల్టీ స్టార్ ఎవడు, అలాగే రవితేజ నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ కృష్ణ. ఈ సినిమాలన్నీ మొదట ఎన్టీఆర్ దగ్గరకి వచ్చాయట. అయితే ఈ సినిమాలన్నింటినీ తారక్ రకరకాల కారణాలతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాలకు స్క్రిప్ వర్కౌట్ కాలేదని.. మరికొన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక.. మరి కొన్ని సినిమాలకు కథ నచ్చక.. ఇలా సినిమాలను వదులుకున్నాడట. ఇక తారక్ తన కెరీర్లో ఈ సినిమాల్లో నటించి ఉంటే ఆయన రేంజ్ మరో లెవెల్ లో ఉండేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.