చిరూ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్.. స్టార్ హీరోగా మారిన తెలుగు విలన్ ఎవరంటే..?

తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగాడు. మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక.. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ కూడా అలా ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఆయన రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలా.. గతంలో మెగాస్టార్ తను నటించన‌ని వదిలేసిన ఓ కథతో.. మరొకరు అవకాశాన్ని అందుకని స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నారు. మొదట పలు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన ఆయ‌న‌.. తర్వాత హీరోగా మరి చిరంజీవికే స్ట్రాంగ్ పోటీ ఇచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

Assembly Rowdy

తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో కరుడుక‌ట్టిన‌ విలన్ గా నటించిన మోహన్ బాబు.. తర్వాత పలు పాజిటివ్ రోల్, సెకండ్ హీరో పాత్రల్లో సైతం నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పూర్తిస్థాయిలో హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా మాత్రం 1991లో తెర‌కెక్కిన అసెంబ్లీ రౌడీ. ఈ మూవీతో మోహ‌న్ బాబు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక బి.గోపాల్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మొదటి చిరంజీవితో చేయాలనుకున్నారట మేకర్స్. ఇక చిరంజీవికి కథలో అక్కడక్కడ లోపాలు కనిపించడం, దానికి తగ్గట్టు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో ఈ సినిమాను వదిలేసాడట‌.

Mohan Babu opens up about social media wars between his and Chiranjeevi's  fans: 'I've never wished anyone harm' - Hindustan Times

ఇంకా చేసేదేమీ లేక బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకువెళ్లి వినిపించాడు. మోహన్ బాబు కథ న‌చ్చేయ‌డంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మోహన్ బాబు సరసన దివ్యభారతి హీరోయిన్గా మెరిసింది. అయితే.. ఇది తమిళ్ సూపర్ సక్సెస్ మూవీ వేలై కీడైచుడుచు సినిమాకు రీమేక్‌గా రూపొందడం విశేషం. అయితే సత్యరాజ్ హీరోగా వ‌చ్చిన ఈ తమిళ్ హిట్‌ను.. టాలీవుడ్లో మోహన్ బాబు ఇమేజ్ కు తగ్గట్టుగా డిజైన్ చేసి బి. గోపాల్ రూపొందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌ తెచ్చుకోవడంతో.. మోహన్ బాబు ఈ సినిమాకు ముందు సైన్ చేసిన కొన్ని సినిమాలకు మాత్రమే విలన్ గా నటించి.. తర్వాత పూర్తిస్థాయి హీరోగా మారిపోయాడు.