వీరమల్లు మ్యాటర్ లో నిర్మాత మొండి పట్టు.. ఇలా అయితే మళ్లి కష్టమే..!

పవ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియ‌న్‌ సినిమాగా.. అత్యంత భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ హరిహర వీర‌మ‌ల్లు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. కానీ.. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా అందరికీ అర్థమైంది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. దాదాపు ఆయన నుంచి ఓ సినిమా రిలీజై ఐదేళ్లు కావడంతో.. సిల్వర్ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ఆరట పడుతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఏఎం రత్నం చేస్తున్న ఫ్యాన్స్‌ను మ‌ళ్ళి అందోళ‌న‌కు గురి చేస్తుంది. ర‌త్నం బయర్స్‌కు నిన్న మొన్నటి వరకు చెప్పిన రేట్స్‌కి ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ చర్చలకు మధ్య చాలా వ్యత్యాసం మొదలైందట.

ట్రైలర్ తర్వాత నుంచి నాన్ స్టాప్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో.. ఆయన బిజినెస్‌లో మరింత జోరు పెంచాడు. అలా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సెంటర్లో కూడా బిజినెస్ ని క్లోజ్ చేయలేదు రత్నం. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో రూ.11 కోట్లు దాదాపు ఓకే అనుకుంటే.. మరో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆయన రూ.14 కోట్ల ఆఫర్ ని ఆశిస్తున్నాడట. ప్రతి సెంటర్లోనూ ఇదే తంతు నడుస్తుంది. సీడెడ్ల రూ.27 కోట్లు అసలు తగ్గడం లేదని టాక్. ఇప్పటివరకు పాన్ ఇండియ‌న్‌ సినిమాలైనా బాహుబలి 2, RRR, పుష్ప 2 సినిమాలు మాత్రమే రూ.27 కోట్ల షేర్ తగ్గించుకొని మ్యాజిక్ క్రియేట్ చేశాయి. అలాంటిది.. రూ.27 కోట్లు డిమాండ్ చేయడం దాని నుంచి అసలు తగ్గకపోవడంతో.. బయర్స్ షాక్‌కు గురవుతున్నారు. రూ.20 నుంచి రూ.23 కోట్ల మధ్యలో అమ్మితే కొనేందుకు చాలా మంది బయ్యర్స్ సిద్ధంగా ఉన్నా.. ఏ మాత్రం అస్సలు దిగిరావడం లేదట.

ప్రతి సెంటర్‌లోను ఇంతకుముందు బయ్యర్స్ ఇస్తామన్న దానికంటే.. 30% ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వచ్చినా.. ఏ.ఏం. రత్నం మాత్రం మరింత ఆశిస్తున్నాడని.. ఆ ట్రైలర్ను చూపించి పుష్ప 2 రేంజ్‌లో థియేట్రికల్ రైట్స్ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి రూ.170 కోట్ల రిలీజ్ బిజినెస్ చేయాలని మొండిపట్టుతో రత్నం కూర్చున్నడట. ఒక్క మెట్టు కూడా కిందకు దిగకుండా ఇలాగే చేస్తూ పోతే.. సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వడం సాధ్యం కాదు. విడుదలకు మరో వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉన్న కూడా.. బిజినెస్ క్లోజ్ అవ్వడం కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు మళ్లీ సినిమా వాయిదా పడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే.. పవన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత రత్నం కాస్త దిగివస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రొడ్యూసర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.