టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకు.. బామ్మర్ది అల్లు అరవింద్ రైటర్ గా పని చేశారని తెలుసా..? అల్లు అరవింద్ కెరీర్లో కేవలం ఒకే ఒక్క సినిమాకు రైటర్ గా పనిచేశాడు. అది కూడా బాక్సాఫీస్ షేక్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, బామ్మర్ది.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా సినిమాలకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అల్లు అరవింద్‌ను ప్రొడ్యూసర్‌గా నిలబెట్టడంలో చిరు పాత్ర.. అలాగే మెగాస్టార్‌గా చిరు ఎదగడంలో అల్లు అరవింద్ పాత్ర చాలా కీలకంగా ఉంటాయి.
ఇక ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మంచి పొజిషన్లో రాణిస్తున్న అల్లు అరవింద్.. ఇతర ప్రొడ్యూసర్లలా రూ.100 కోట్ల సినిమాల వైపు అడుగులు వేయకుండా.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఆచితూచి ఎంచుకుంటూ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నిర్మాతగా స్టోరీస్‌ని జడ్జ్ చేసే ఆయన.. రైటర్ గాను సినిమాకు పనిచేశాడు. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన యమకింకరుడు. చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, జయమాలిని, అల్లు రామలింగయ్య, సిల్క్ స్మిత, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ కీలకపాత్రలో మెరుసారు. 1982 అక్టోబర్ 22న.. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. చిరంజీవి మాస్ హీరోగా ఎదిగాడు. ఆ టైంలో చిరు నటించిన నాలుగు సినిమాలు ఒక్కసారి రిలీజ్ కావడం విశేషం. అయినా నాలుగు సినిమాల ప్రభావాన్ని తట్టుకొని కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి ఈ మూవీ హిట్ అయింది.
రాజా భారత్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు రైటర్ గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను అల్లు అరవింద్ వ్యవహరించారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా.. ఆస్ట్రేలియన్ మూవీ మ్యాడ్ మ్యాక్స్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కాగా.. ఈ సినిమా స్క్రిప్ట్ రైటింగ్ లో అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అయి.. చాలా కష్టపడ్డారట. ఆయన రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఏకైక సినిమా ఇదే. చిరంజీవికి తెలుగులో తిరుగులేని మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు, ఆద్యాంతం యాక్షన్, ఎమోషన్లతో సాగిన ఈ సినిమా.. సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే.. మొదటి వారంలో ఏకంగా రూ.18 లక్షల వసూలు కొల్లగట్టి ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది.