అలా అయితేనే సినిమాలు చూడండి.. లేదంటే వద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

ఛ‌ల్లో సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన రష్మిక.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాడ్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంగతి తెలిసిందే. తను నటించిన‌ అన్ని సినిమాలతోను బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుంటూ నేషనల్ క్రష్‌గా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుకంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక.. ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం గడిచిపోయింది. మామూలుగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇంతకాలం అవుతుంటే.. కెరీర్ స్పేన్‌ తగ్గిపోతూ ఉంటుంది. కానీ.. రష్మిక విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది.

Reports of Rashmika Mandanna's refusal to attend Bengaluru film ...

ఆమెకు అంతకంతకు అవకాశాలు పెరుగుతూ పోతున్నాయి. దీనికి కారణం ఒక దగ్గర స్టిక్ అవ్వకుండా అన్ని ఇండస్ట్రీలో తనని తాను కేర్ఫుల్ గా బిల్ట్ చేసుకోవడమే. ఈ క్రమంలోనే సౌత్ నార్త్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను రష్మిక ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి క్రమంలో రష్మిక చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. తను సినిమాలో అలాంటి సీన్స్‌ ఉంటే మాత్రం సినిమానే వదిలేస్తా అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా ట్రెండ్‌ అవుతున్నాయి. ప‌లు సినిమాలతో తన సత్తా చాటుకుంటున్న ఈ చిన్నది.. స్టార్ హీరోల సినిమాల‌తో పాటు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలోను న‌€టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. ఇక.. తాజాగా రష్మిక మందన్న మాట్లాడుతూ సినిమాల్లోకి రావాలని చాలామంది ఆశపడతారు.

Rashmika Mandanna says never let criticism 'weigh you down' after  Sikandar's failure: 'Don't burden yourself with...' | Hindi Movie News -  Times of India

కానీ.. దక్షిణ భారత కుటుంబంలో చిత్ర పరిశ్రమంలోకి రావడం చాలా తప్పని ఫీల్ అయ్యేవాళ్ళు. నా కెరీర్‌ ప్రారంభంలో నా కుటుంబం కూడా దీనికి అంగీకరించలేదు. తర్వాత మెల్లమెల్లగా ఓకే చెప్పారు అంటూ రష్మిక వివరించింది. ఇక.. మీకు నచ్చని పాత్ర ఏదంటే.. పాత్ర అని కాదు కానీ స్పోక్ సీన్లు నేను అసలు ప్రోత్సహించనని.. సినిమాల తన పాత్రకు స్మోకింగ్ అలవాటు ఉన్నా.. ఆ పాత్రను అస్సలు ఒప్పుకోన‌ని.. అంగీకరించని చెప్పేసింది. తెరపై ఎప్పటికీ అలాంటి రోల్ లో అసలు కనిపించనంటూ వివరించింది. యానిమల్ సినిమా కాంట్రవర్సీ ల గురించి తాను రియాక్ట్ అవుతూ.. ప్రతి ఒక్క ఆడియన్ తెరపై చూసిన సన్నివేశాలతో ప్రభావితుడవుతాడు అంటే నేను అసలు ఒప్పుకోను. ఒకవేళ అలా అవుతారంటే మరి నచ్చిన మంచి సినిమాలే చూడండి.. మిగిలినవి వదిలేయండి అంటూ రష్మిక క్లారిటీ ఇచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.