సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ” వీరమల్లు ” ట్రైలర్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరోలకు సంబంధించిన టీజర్ గాని.. ట్రైలర్ గానీ రిలీజ్ అయితే సోషల్ మీడియాలో భీభ‌త్స‌వం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కడ చూసినా ఆ ట్రైలర్ గురించి టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలు తెగ పొగిడేస్తూ మురిసిపోతూ ఉంటారు. నెక్స్ట్ లెవెల్‌లో ట్రైలర్ ఉంది అంటూ తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా యాంటీ ఫ్యాన్స్ కూడా సహజం.

ఈ క్రమంలోనే యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమా ట్రైలర్లను లేదా.. టీజర్ ట్రోల్స్ చేసే పనిలో బిజీ అయిపోతారు. అలా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరబ‌ల్లు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌ను చూసిన ఫ్యాన్స్.. పూన‌కాలతో ఊగిపోతుంటే.. సినిమాకు విపరీతమైన ట్రోల్స్, మీమ్స్‌ ఎదురవుతున్నాయి. ప్రస్తుత స‌వ‌న్‌ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల పరంగానే కాదు.. రాజకీయపరంగా ప్రతిపక్షంలో ఉన్నా.. వాళ్ళు కూడా తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు.

వాటిలో కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా.. పవన్ కళ్యాణ్ ట్రైలర్ చివర్లో.. బల్లెం పట్టుకొని తిప్పుతూ తన ఎదురుగా వచ్చే బల్లెలను కొట్టడం బాహుబలి నుంచి కాపీ చేశారంటూ.. అదేకాదు.. ఈ ఫైట్లో, గిర్ర గిర్ర బల్లం తిప్పుతూ విలన్స్‌ను నరికే సీన్ అరవింద సమేత నుంచి తీసుకున్నారంటూ తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం లుక్స్ తో కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులైతే ట్విట్ పై ట్విట్ట్లు వేస్తున్నారు. ఇవి మరింతగా వైరల్ అవుతున్నాయి.