పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ కానుంది. అన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక ఆంచనాలను రెట్టింపు చేసేందుకు మేకర్స్.. సినిమా థియేటర్ ట్రైలర్ మరి కొద్ది నిమిషాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సైతం మొత్తం 120 థియేటర్లలో ఈ ట్రైలర్లు ఫ్యాన్స్ కోసం స్పెషల్గా టెలికాస్ట్ చేయనున్నారు. అయితే చాలా కాలం తర్వాత వస్తున్న పవన్ మూవీ కావడం.. అది కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఆకాశానికంటాయి.
ఈ క్రమంలోనే కొన్ని థియేటర్ల యజమానులు జనాన్ని కంట్రోల్ చేసేందుకు తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా.. తాజాగా బెంగళూరులోని సంధ్య థియేటర్లో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్రికల్ ట్రైలర్ అడ్వాన్స్ బుకింగ్స్‌ని.. నిన్న రాత్రి ప్రారంభించారు. బుకింగ్స్ మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లో వెయ్యి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం విశేషం. ఎందుకంటే అభిమానులు థియేటర్లలో అత్యుత్తంతో హంగామా చేస్తూ.. ఏదైనా డామేజ్ చేసిన డ్యామేజ్ ఖర్చులు కవర్ చేయడానికి ఇలా చేసినట్లు థియేటర్యాజమాన్యం చెప్తున్నారు. అలా రూ.16 టికెట్ రేట్ అయితే పెట్టారు. కానీ.. అన్ని రకాల చార్జీలతో కలిపి మొత్తంగా రూ.36 ఖర్చయింది.
దీంతో కేవలం ఒక్క షో నుంచి.. రూ.28 వేల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలోనే వీరమల్లు డిమాండ్ వేరే లెవెల్లో ఉన్న నేపథ్యంలో అదే థియేటర్‌లో మరికొన్ని స్పెషల్ షోలు యాడ్ చేసేందుకు టీం ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. బెంగళూరులో ఇది గ్రాండ్ సక్సెస్ అయిన క్రమంలో.. ఇదే పద్ధతిని తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి నిర్మాతలు అలాగే ఆలోచనలు చేస్తారా.. లేదా.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు షోలు ఖచ్చితంగా పెంచాల్సి ఉంది. అంతేకాదు బెంగళూర్ మోడల్ లోనే అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆన్లైన్లో పెట్టాల్సి ఉంది. లేదంటే.. వచ్చే జనాలను కంట్రోల్ చేయడం కష్టం కొన్నిచోట్ల అనర్ధాలు జరిగే అవకాశం ఉందని నేటిజల్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.