” 8 వసంతాలు ” రివ్యూ.. పోయెటిక్ లవ్ స్టోరీ.. !

మ్యాడ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యార్నేని, రవిశంకర్ నిర్మాణంలో ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హను రెడ్డి, రవితేజ కీలకపాత్రలో మెరిసారు. ఇక సినిమా నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. కాగా.. నిన్న రాత్రి సినిమా స్పెషల్ ప్రీమియర్స్ కూడా ముగిశాయి. ఇక ఈ మూవీ ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుంటుందా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.

8 Vasanthalu: మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి & అనంతిక సనీల్‌కుమార్‌  '8 వసంతాలు' - Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper  in USA - Telugu Times

కథ:
2013 బ్యాక్ డ్రాప్ తో స్టోరీ మొదలైంది. ఊటీలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్పించే స్కూల్లో.. పొగరుగా ఉండే వరుణ్ (హను రెడ్డి)ని శుద్ధి అయోధ్య (అనంతిక) ఓడిస్తోంది. దాంతో వరుణ్.. శుద్ధి నీ ప్రేమిస్తాడు. ఇక సుద్ది తండ్రి చనిపోవడంతో తన టీ ఎస్టేట్స్‌ని చూసుకుంటూ.. రచయితగా బుక్స్ రాస్తూ.. లైఫ్‌ లీడ్ చేస్తుంది. ఇక వ‌రుణ్.. శుద్ది అయోధ్య చుట్టు తిరుగుతూ కొన్నేళ్లు ఆమె కోసమే అరాచపడుతూ ఉంటాడు. చివరికి ప్రపోజ్ చేస్తాడు. శుద్ధి కూడా వరుణ్‌తో ప్రేమకు ఓకే చెప్తుంది. కానీ.. కొన్ని కారణాలతో వరుణ్ శుద్దిని వదిలేస్తాడు. అదే టైంలో తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు కూడా చనిపోతాడు. ఈ పరిణామాలను శుద్ధి ఎలా తట్టుకొని నిలబడింది.. ప్రేమని మర్చిపోయి.. గురువు కోసం ఏం చేసింది.. మళ్ళీ తన లైఫ్ లోకి ప్రేమ వచ్చిందా.. లేదా.. అనేది అసలు కథ.

రివ్యూ:
డైరెక్టర్ ఫ‌నింధ్ర నార్సెట్టి గతంలో మధురం, బ్యాక్ స్పేస్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తర్వాత.. మనూ సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఇప్పుడు 8 వసంతాలు సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. తన స్టైల్ లోనే ప్రేక్షకులను మెప్పించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. టైటిల్ కు తగ్గట్టుగానే ఒక అమ్మాయి లైఫ్ లో 8 వసంతాలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఫస్ట్ ఆఫ్ అంత లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ మరో ల‌వ్ స్టోరి. కథపరంగా రొటీన్, రెగ్యులర్ లవ్ స్టోరీ అనిపించినా.. అమ్మాయి దృక్పథం నుంచి క‌థ‌ని మ‌లిచిన తీరు.. అచ్చ తెలుగులో కవితాత్మకంగా మాట‌లు.. ముఖ్యంగా ఒక అమ్మాయి మానసికంగా, శారీరకంగా ఎంత బలంగా ఉండగలదో అనే పాయింట్ ఆడియన్స్‌ను మెప్పించేలా చూపించారు.

8 Vasantalu Movie Review (2025) - ibomma - ibomma

అంతే కాదు గురు శిష్యుల మధ్య బంధం, పేరెంట్స్ పిల్లలపై తమ కోరికలను రుద్దడం, పిల్లలు ఏమైనా కొత్తగా చదువుతా లైఫ్ లో ఏదైనా డ్రీమ్ సాధిస్తా అని చెప్పినా పేరెంట్స్ వినకపోవడం, అనాధల లైఫ్, రచయితల బ్యాక్ డ్రాప్, చదువు విలువ ఇలా ఎన్నో అంశాలను అంతర్లీనంగా కథతో పాటు చూపించారు. ఫస్ట్ అఫ్ ఓకే అనిపించినా.. అమ్మాయి వెనుక పడే లవ్ స్టోరీలా సాగిన.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎంతో సందేశం ఇచ్చారు. అయితే తను మాత్రం లవ్ కోసం ఆరాటపడుతూ.. ఫ్రెండ్స్ లవ్ బ్రేకప్ అయితే మంచికే జరిగింది అని చెప్పే క్యారెక్టర్ వెరైటీగా అనిపించింది. క్లైమాక్స్‌ హీరో తన ఫీలింగ్స్ ని చెప్పే సీన్స్ ఎమోషనల్ గా ట్రై చేసిన.. ఏదో డైలాగులు చెప్పుకుంటూ వెళ్లినట్లే అనిపిస్తుంది.

కొన్నిచోట్ల కంటిన్యూటీ షాట్స్‌ మిస్ చేశారు. సెకెండ్ హీరో లుక్స్ ఎందుకు పాతకాలం హీరోల కనిపించాయిజ‌జ‌ అతనికి విగ్ పెట్టారని ప్రతి సీన్లోనూ క్లియర్గా అర్థమవుతుంది. పాత్రకు అవసరం లేకుండా విగ్ ఎందుకు.. సీరియల్ షాట్స్ అనిపించేలా పాతకాలం క్లైమాక్స్ లా సీన్స్ క్రియేట్ చేయడం.. ఎందుకు డైరెక్టర్‌కే తెలియాలి. సినిమాలో ఎమోషన్స్‌కి.. ఆడియన్స్ కంటి వెంట నీరు వస్తే ఎమోషన్స్ కచ్చితంగా పండినట్లే. కానీ.. ఈ సినిమాలో అలాంటి ఎమోషన్స్ అసలు పండలేదు. సన్నివేశాలు ఉన్నా.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.

Frist Single From 8 Vasanthalu Is A Beautiful Love Melody | cinejosh.com

సెకండ్ హాఫ్ లో రాణి మాలిని అని ఎపిసోడ్ ఏదో హీరో ఎలివేషన్ కోసమే తీసినట్లు అనిపించింది. ఇక‌ స్టోరీ.. డైలాగ్స్.. చాలా సినిమాల్లో ఉన్నవే. సెకండ్ హాఫ్ చివర్లో రాసుకున్న రివర్స్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. అక్కడ రివ్యూ చేసే ట్విస్టులు రెగ్యులర్గా సినిమాలు చూసే ఆడియన్స్‌కు అర్థం కావు. మొత్తంగా ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండగలదని విషయాన్ని జీవితంలో ఉన్న రెండు కథలను.. కవితాత్మకంగా తెర‌కెక్కించారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు.

నటీనటుల పర్ఫామెన్స్:
సినిమాకు అనంతిక యాక్టింగ్ అతిపెద్ద ప్లస్. ఓపక్క మార్షల్ ఆర్ట్స్ పర్ఫామెన్స్ చేస్తూనే.. ఎమోషనల్, లవ్ సీన్స్ లో పండించడం అంటే అది సాధారణ విషయం కాదు. ప్రతి సీన్‌లోను ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అనంతిక సినిమాతో అమ్మడికి ప్రశంసలు ద‌క్క‌డం ఖాయం. ఇక అవార్డ్‌లు, కొత్త అవకాశాలు క్యూ క‌ట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. హ‌ను రెడ్డి లవర్ రోల్లో మంచి నటన కనబరిచాడు. రవితేజ గతంలో షార్ట్ ఫిలిమ్స్ లోకి తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన లుక్స్ మాత్రం అసలు సెట్ కాలేదు అన్న ఫీల్ వచ్చింది. ఇక.. కన్నా, సంజ‌న, అనంతిక ఫ్రెండ్స్ పాత్ర‌లు ఫుల్ ఫల్జ్‌డ్‌గా చేశారు. అనంతిక తల్లి పాత్రలో నటించిన నటి.. క్లైమాక్స్‌లో మెప్పించింది. మిగిలిన పాత్రల్లో నటీనటులంతా వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

8 Vasanthalu: '8 వసంతాలు' హార్ట్ వార్మింగ్ టీజర్ - Latest Telugu News |  తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times

టెక్నికల్ గా:
సినిమటోగ్రఫీ, విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. సినిమాకు ప్రాణం పోసినట్లు అనిపించింది. కెమెరామెన్ విశ్వనాథ్ చాలా అందంగా ప్ర‌తి ఫేమ్ డిజైన్ చేశాడు. కచ్చితంగా విజువల్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కవితాత్మక డైలాగ్ ని ఎలివేట్ చేయడం, డైరెక్టర్ చేసిన చిన్న చిన్న తప్పులు అన్ని కవర్ చేయడానికి ఎంతగానో తోడ్పడింది. ఉన్న రెండు సాంగ్స్ వినడానికి వినసొంపుగా ఉన్నాయి. లొకేషన్స్ కూడా ఆకట్టుకున్నాయి.

కాశ్మీర్, ఊటీ, ఆగ్రా, కాశి అందాలను సినిమాలో కొత్త కొత్తగా అద్భుతంగా చూపించారు. ఎడిటర్ కూడా ఎక్కడా బోర్ ఫీల్ లేకుండా పర్ఫెక్ట్ గా కత్తెరకు పని చెప్పాడు. పాజిటివ్ డిజైన్స్ ఆకట్టుకున్నాయి. లొకేషన్ కు తగ్గట్లుగా సీన్స్ చక్కగా డిజైన్ చేశాడు. డైరెక్టర్. ముఖ్యంగా హీరోయిన్ ప్రతి కాస్ట్యూమ్‌ ఆమెకు బాగా సెట్ అయింది. ఒక రెగ్యులర్ కథ‌ని ఒక అమ్మాయి దృక్పథంలో బలంగా చూపించడానికి.. తనకు అచ్చొచ్చిన కవితాత్మక స్టైల్‌లో.. డైలాగ్స్‌తో సినిమాను నడిపే ప్రయత్నం చేశాడు. ఇక మైత్రి సంస్థ నిర్మాణం విలువలు బాగున్నాయి.

8 Vasantalu Early Review: Ananthika Sanilkumar Shines in Phanindra  Narsetti's Laudable Attempt

ఫైనల్ గా:
8 వసంతాలు మూవీ ఓ అమ్మాయి లైఫ్ ఎనిమిది సంవత్సరాలలో జరిగిన అన్ని సంఘటనలో.. ప్రేమ కథలతో.. కవితాత్మకంగా అచ్చ తెలుగు మాటల్లో రూపొందించారు.

రేటింగ్: 3/5