టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క తన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిరియాడికల్ యాక్షన్ డ్రామ హరి హర వీరమల్లు సినిమా షూట్‌ను పూర్తి చేసిన పవన్.. నెక్స్ట్ సినిమా సెట్స్‌లోను సందడి చేశాడు. ఈ సినిమా సైతం ముగించుకుని త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అయితే.. పవన్ ప్రస్తుతం ఉన్న లైనఫ్ సినిమాల అన్నింటిలో ఆడియన్స్‌లో ఎక్కువ ఆసక్తి నెలకొల్పుతున్న మూవీ మాత్రం ఓజి.
సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అది కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో మరింత హైప్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సినిమా డీల్స్ కూడా భారీ లెవెల్లో జరుగుతున్నాయట. ఈ క్రమంలోనే ఊహించని రేంజ్లో సినిమాకు తెలుగు రాష్ట్రాల బిజినెస్ జరిగిందని సమాచారం. కేవలం తెలుగు స్టేట్స్ బిజినెసే.. రూ.100 కోట్లకు దాటిందని టాక్ నడుస్తుంది.
ఇలా.. ఆంధ్రాలో సీడెడ్ మినహాయించి.. రూ.80 కోట్లకు పైగా మేకర్స్ హక్కులను కొనుగోలు చేసినట్టు టాక్. దీన్నిబట్టి ఓజి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక.. సిడెడ్లో బిజినెస్ క్లోజ్ కావాల్సి ఉంది. అక్కడ కూడా భారీ మొత్తంలో హక్కులను విక్రయించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సీడెడ్ లో ఇది ఎంతకు అమ్ముడుపోతుందో చూడాలి. ఇక థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో.. అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు కీలక పాత్రలో మెరమన్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది.