టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ ది రాజాసాబ్. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమా టీజర్ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మారుతి ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మారుతి.. ఒకప్పుడు నాన్న అరటి పళ్ళు అమ్మిన ఇదే ప్రాంతంలో.. ఇప్పుడు నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. జీవితం ఫుల్ ఫీల్ అయిందనిపిస్తుందని వివరించాడు. మచిలీపట్నం కృష్ణ కిషోర్ కాంప్లెక్స్.. (ప్రజెంట్ సిరి కాంప్లెక్స్) ఒక టైం లో ఇక్కడ మా నాన్న చిన్న దుకాణం పెట్టుకుని అరటిపళ్ళు అమ్మారు.
సినిమాల్లోకి అడుగు పెట్టాలని ఆశతో ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా హీరో బ్యానర్ నేను సిద్ధం చేసే వాడిని. ఒక్కసారి అయినా.. మన పేరు ఇలా స్క్రీన్ పై చూడాలని కలలు కన్న వాళ్ళలో నేను ఒకడిని. ఈరోజు అది నిజమైంది. అదే కాంప్లెక్స్ వద్ద నిల్చుని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంటే.. లైఫ్ పరిపూర్ణమైందనిపిస్తుంది. పాన్ ఇండియన్ స్టార్ హీరో పక్కన నా కటౌట్.. ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకేం కావాలి.. ఈరోజు మా నాన్న ఉండుంటే ఎంతగానో గర్వపడేవారు అంటూ తన ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నాడు మారుతి. నేను.. నాన్నను ఎంతగానో మిస్ అవుతున్నానని రాసుకొచ్చిన ఆయన.. మీ అందరూ నాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలు అంటూ వివరించాడు.
ఇది చాలా చిన్న పదం అనిపిస్తుంది.. ఉన్న సమయంలోనే మన బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది.. నేను అలా మన డార్లింగ్ చూపించాలని ఆశపడ్డ.. ఇప్పుడు మీ అందరికీ చూపించగలిగా.. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి అని కోరుకుంటున్నా అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కపూర్, సంజయ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ వ్యవహరిస్తున్నారు. ఇక డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ ప్రస్తుతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.