లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో అనుష్క.. బ్యాక్ డ్రాప్ ఇదే..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్న‌ర‌ కాలంపాటు.. ఇండస్ట్రీలో రాణించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సినిమాల పరంగా బాగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు వ‌స్తున్న‌ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఘాటితో అలరించేందుకు సిద్ధమవుతున్న స్వీటీ.. జులై 11న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. అలాగే.. మలయాళంలో.. కధ‌నార్ ది వైల్డ్ సోర్సరర్ సినిమాల్లోనూ నటించింది. ఇక‌ ఈ ఏడాదిలోనే ఆ మూవీ ఆడియన్స్‌ను పలకరించినట్లు సమాచారం.

Anushka Shetty TM | #LokeshKanagaraj is set to bring all the important  characters of Lokesh Cinematic Universe in Kathi2🔥 Lady SuperStar # AnushkaShetty is said... | Instagram

కానీ.. వీటి తర్వాత ఆమె నటించిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే.. ఇప్పుడు ఇదే అంశంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. ఆమె డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్‌ యూనివర్స్ లో అడుగు పెట్టనుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్.. హీరో కార్తీతో కలిసి ఖైదీ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఖైదీ సినిమాకు ఫ్రీక్వల్గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక.. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ లో అనుష్క శక్తివంతమైన పాత్రలో నటించనుంద‌ని సమాచారం. అది కూడా.. ఖైదీ భార్య రోల్ అని టాక్ నడుస్తుంది.

Çíñëphîlé ✨ on X: "Buzzing : #AnushkaShetty mam was roped important role in  #Kaithi2 ❤️‍🔥 If it's is happens #Alexpandiyan combo is back. #Suriya na &  #KamalHaasan sir also playing cameo with #

ఇప్పటికే.. ఈ పాత్ర పై ఆమెతో సంప్రదింపులు జరిపారని.. ఆమె కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాక్‌ నడుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే కార్తీక్‌తో అనుష్కకు ఇది రెండవ సినిమా అవుతుంది. గతంలో.. వీళ్ళిద్దరూ అలెక్స్ పాండియన్ సినిమాలో నటించి మెప్పించారు. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్న టీం.. ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకురానున్నట్లు సమాచారం.