పాతికేళ్ల ప్రామిస్‌ను మనవడి కోసం బ్రేక్ చేసిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. దెబ్బకు అందరూ ఫిదా

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి మూడో తారం ఎన్టీఆర్ అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా.. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా.. ఈ సినిమా లాంఛనాలతో మొదలైంది. సినిమా ప్రారంభోత్సవం వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్‌కు అందరి ఆశీస్సులు అందించారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ గా మారుతుంది.

New Entry From Nandamuri Family: NTR Is Here! | New Entry From Nandamuri  Family: NTR Is Here!

గతంలో మోహ‌న కృష్ణ‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. దాదాపు 18 ఏళ్లు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఆయన.. ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమాలను ఎక్కువగా సినిమాటోగ్రఫీ చేశాడు. చండశాసనుడు సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభం కాగా.. 2000 సంవత్సరంలో విడుదలైన గొప్పింటి అల్లుడు సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. గొప్పింటి అల్లుడు సినిమా రిలీజ్ తర్వాత తాను కెమెరా పట్టుకోనన్ని శ‌బ‌ద్దం చేసిన మోహనకృష్ణ.. మనవడిపై ప్రేమతో తాజాగా ఎన్టీఆర్ కోసం ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేశాడు. సినిమా లాంచ్ లో ఫస్ట్ షాట్ కు గౌరవ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించడం విశేషం. ఇక ప్రస్తుతం.. మనవడిపై అభిమానంతో ఆయన చేసిన పని కుటుంబ సభ్యులకు, అభిమానులకు కూడా ఆనందాన్ని అందించింది.

Nandamuri Mohana Krishna - Photos, Videos, Birthday, Latest News, Height In  Feet - FilmiBeat

25 సంవత్సరాల క్రితం ప్రామిస్‌ను మనవడి కోసం బ్రేక్ చేయడం అంటే అది సులువైన విషయం కాదని.. ఆయనకు తన కుటుంబం, మనవ‌డి పై ఉన్న ప్రేమ ఏంటో అర్థం అవుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైవియ‌స్‌ చౌదరికి మొదటి నుంచే నందమూరి ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం. ఈ క్రమంలోనే జానకిరామ్ కొడుకు రామ్‌తో చేసే సినిమాతో అయినా వైవిఎస్ చౌదరి సక్సెస్ ట్రాక్ లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇక.. నందమూరి కుటుంబం నుంచి నాలుగో తరం హీరోగా అడుగుపెడుతున్న ఈ ఎన్టీఆర్.. పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకొని నందమూరి కుటుంబ.. కీర్తి, ప్రతిష్టలను మరింతగా పెంచుతాడా.. లేదా. వేచి చూడాలి. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివిల్ చేయనున్నారు టీం.