ప్రభాస్ – తారక్ కాంబోలో మల్టీస్టారర్ ఫిక్స్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గా ఎన్టీఆర్.. !

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోలలో ఎలాంటి పాత్రైనా పోషించి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకోగల సత్తా ఉన్న హీరో అనగానే టక్కున వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించి ప్రేక్షకులను మెప్పించాడు తారక్.. తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో తారక్ నటించబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస‌స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర తో పాటు, బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ అప్కమింగ్ సినిమాలో నేతాజీ పాత్ర కోసం ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారికి ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి ముందు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. 1943 కాలంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఆజాది హిందూ సైనికుడుగా ప్రభాస్ కనిపించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో నేతాజీ పాత్ర కోసం ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని.. ఈ పాత్ర నడివి తక్కువగా ఉన్న.. పాత్ర‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని టాక్.

నేతాజీ పాత్ర ఎక్కువగా ప్రభావితం చూపడంతో.. ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన సంప్రదించారట‌. హ‌ను రాఘవపూడికి మొదటి నుంచి తార‌క్ పై ప్రత్యేక అభిమానం ఉంది. గతంలో ఎన్టీఆర్‌తో ఈయ‌న సినిమా చేయడానికి తన ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా ప్రభాస్ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రకు ఎన్టీఆర్‌ను నటింపజేయాలని ఎన్టీఆర్‌తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడట. ఒకవేళ ఈ వార్త‌ నిజమైతే.. ఎన్టీఆర్‌ను నేతాజీగా, ప్రభాస్‌ను సైనికుడిగా చూడాలనుకుంటున్న ఇద్దరు హీరోల అభిమానుల కోరికలు తీరిపోయినట్టే. సినిమాపై టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా మరింతగా హైప్ పెరగడం ఖాయం.