జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పాలిటిక్స్ లో తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పొలిటికల్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడంతో ఆయన లుక్ అంత మారిపోయింది. పవన్ కళ్యాణ్ వర్కౌట్‌లు చేసి లుక్ మార్చుకొని సినిమాల్లోకి రియంట్రిస్తే మాత్రం పవన్ కు తిరుగుండదనటంలో అతిశయోక్తి లేదు. అలాగే పవర్ స్టార్ డేట్ ల కోసం ఆయన సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలు కూడా ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
కనీసం 10 నుంచి 15 రోజులు డేట్లైన కేటాయిస్తే ఓజీ, హరిహర వీరమల్లు షూటింగ్స్ ను పూర్తి చేయొచ్చని వారు భావిస్తున్నారు. కలెక్షన్ పరంగా కూడా ఈ మూవీస్ అదరగొట్టే అవకాశాలు ఉన్నాయని అభిమానుల కామెంట్ల ద్వారా అర్థమవుతుంది. ఓజీలో యాక్షన్ ఎక్కువగా ప్రాధాన్యత ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు రూ.450 కోట్లు కావడం విశేషం.
హరిహర వీరమల్లు ఏఎం రత్నం నిర్మాత కాగా.. ఓజీ సినిమాకు డివివి దాన్నయ్య ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మొదట రిలీజ్ అయిన ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే హరి హర వీరమల్లు డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఓజీ డిజిటల్ రైట్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో కనీసం ఇంకా నెలరోజులైనా బిజీగా ఉంటారని.. ఆ తర్వాత పవన్ తన వర్కౌట్లతో లుక్ మార్చుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమా సెట్స్ లో పాల్గొనన్నునాడని తెలుస్తుంది. ఆయన కెరీర్ ప్లానింగ్ లో అభిమానులను ఆకట్టుకునే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్.