ఆ వ్యక్తిని మోసం చేసి మరో వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న రకుల్.. ఘోరంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఎంతోమంది స్టార్ హీరోల సరస‌న‌ నటించి మంచి గుర్తింపును సైతం సంపాదించుకుంది.

 

ఇక ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె మూవీస్ విషయం పక్కన పెడితే.. గత కొద్దికాలం నుంచి రకుల్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇది ఇలా ఉంటే గతంలో రకుల్ ఓ వ్యక్తి ని మోసం చేసి ప్రస్తుతం హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్మానీతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి తో రకుల్ రెండు సంవత్సరాలుగా ప్రేమాయణం నడిపి.. అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా విడిపోయారట. ఇక ఆ తరువాత జాకీ భగ్మానీతో ప్రేమలో పడిందట రకుల్. మరి ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.