ఆ రాష్ట్రంలో రజిని రికార్డుని బ్రేక్ చేసిన ప్రభాస్.. ఆనందంతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్…!

స్టార్ హీరో రజనీకాంత్ ఈ 2023న ” జైలర్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి విజయాన్ని అందుకున్నాడో మనందరికీ తెలిసిందే. జైలర్ మూవీ కన్నడ వర్షం సాధించిన వసూళ్లను ప్రభాస్ మూవీ బ్రేక్ చేసింది. కర్ణాటకలో ప్రభాస్ మూవీ సంచలనాలు సృష్టించడంతో ఫ్యాన్స్ కు ఎంతో సంతోషం కలిగిస్తుంది.

ప్రభాస్ హీరోగా .‌.శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ మూవీ నుంచి తాజాగా క్లైమాక్స్ డైలాగ్ విడుదల కాగా ఇది థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక సలార్ సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో సలార్ శౌర్యాంగపర్వం మూవీ కూడా వేరే లెవెల్ లో ఉండబోతున్నట్లు సమాచారం. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ” జైలర్ ” మూవీ రికార్డులను బ్రేక్ చేసింది సలార్. ఇక దీంతో డార్లింగ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ” సలార్ ” సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సలార్ 2 ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.