డైరెక్షన్‌లోనే కాదు నటనతోను సత్తా చూపడానికి సై అంటున్న రాజమౌళి.. మహేష్ తో క‌లిసి న‌టించ‌బోతున్న జ‌క్క‌న‌ ..

టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ స్థానానికి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే ఠ‌క్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలోని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో స్పెషాలిటీ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడానికి కూడా కారణం అదే. ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటుతున్నాయి.

జక్కన్న గతంలో తెరకెక్కించిన బాహుబలి 1,2ల‌తో పాటు ఆర్‌ఆర్ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఇక రాజమౌళి తన నెక్స్ట్ మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెర‌కెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. కాగా ఈ సినిమాలో రాజమౌళి కూడా ఒక చిన్న పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శక ధీరుడుగా డైరెక్ష‌న్‌లో సత్తా చాటిన రాజమౌళి ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లో మెరిసాడు.

అయితే మొదట రాజమౌళి యాక్టర్ కావాలనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట. కానీ అనుకోకుండా దర్శకుడుగా మారి పాపులారి దక్కించుకున్నాడు. దీంతో యాక్టర్ గా మారే అవకాశం కూడా ఆయనకు దక్కలేదు. ఇక రాజమౌళి తన సినిమాలో అయినా ఓ కీలక పాత్రలో నటించి న‌ట‌న‌లో కూడా స‌త్తా చూపాల‌ని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నెక్స్ట్ మహేష్ బాబుతో తెర‌కెక్కించబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ వార్త‌లో సిజంఎంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాలి.