” దళపతి 68 ” సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ సెట్ చేసిన మేకర్స్…!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం వెంకట్ ప్రభువు దర్శకత్వంలో ” కెరీర్ 68వ ” మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ మూవీ ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ” బాస్ ” అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మేకర్స్ దానిని కొట్టిపడేశారు.

ఇక ప్రస్తుతం విజయ్ 68వ మూవీకి…G.O.A.T అనే టైటిల్ ని సెట్ చేసినట్లు కోలీవుడ్ టాక్. ఇక దీనిపై ఎటువంటి అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇక ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే.. తెలుగులో సుడిగాలి సుదీర్ హీరోగా G.O.A.T అదే టైటిల్ తో ఓ మూవీ ఆల్రెడీ రూపొందింది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.