బాలయ్య – బాబీ మూవీ లో ఓ సీనియర్ హీరోయిన్… ఎవరంటే..!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన… ప్రస్తుతం వయసు మీద పడుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇక ఇదే ఊపులో తన తదుపరి మూవీ దర్శకుడు బాబీ తో చేస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవర్ని తీసుకోనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే త్రిష ఈ మూవీలో హీరోయిన్గా చేయనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి ని తీసుకోబోతున్నారంటూ మరో ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కు యాక్టింగ్ కి ఎక్కువగా స్కోప్ ఉండడంతో… నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ప్రియమణి అయితే బాగుంటుందని దర్శకుడు బాబీ భావించి ఈ సినిమాలో ఈమెనే హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.