ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం… 20 థియేట‌ర్ల‌లో ‘ స‌లార్ ‘ మిడ్ నైట్ షోలు.. లిస్ట్ ఇదే…!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ సలార్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఈ సినిమా మొదటి భాగం సీజ్‌ ఫైర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ యాక్షన్ ట్రైలర్‌తో ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలను ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడు టికెట్స్ కొనుగోలు చేద్దామా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటిరోజు మొత్తం తెలంగాణలో అన్ని థియేటర్స్ లోనూ ఆరు షోలు పడబోతున్నాయి.

ఇక 20 సెలెక్టెడ్ థియేటర్లలో మిడ్ నైట్ షో లు కూడా పడున్నాయి. టికెట్ రేట్‌ల‌ విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్ లో రూ.250, రూ.175, రూ. 100గా రేట్లు ఉండగా.. మల్టీప్లెక్స్ థియేటర్లో రూ.370, రూ.470 తో టికెట్స్ అమ్మాలని మేకర్స్ నిర్ణయించారు. అంటే సాధారణ టికెట్ ధరతో పోలిస్తే మల్టీప్లెక్స్ లో రూ100, నార్మ‌ల్‌ థియేటర్లో రూ.50 పెంచుకునేందుకు అనుమతి కూడా ఇచ్చారు. తెలంగాణ థియేటర్స్ లో హక్కులను మైత్రి మూవీ మేకర్ సొంతం చేసుకోగా.. మిడ్ నైట్ షో లను ఈ 20 థియేటర్లోనూ తెల్లవారుజామున ఒంటిగంటకే ప్రారంభమవుతుంది.

1. నెక్సెస్ – కూకట్‌ప‌ల్లి,

2. ఏఎంబి సినిమాస్ – గచ్చిబౌలి,

3. భ్రమరాంబ థియేటర్స్ – కూకట్‌ప‌ల్లి,

4. మల్లికార్జున థియేటర్స్ – కూకట్‌ప‌ల్లి,

5. అర్జున్ థియేటర్ – కూకట్‌ప‌ల్లి,

6. విశ్వనాథ్ థియేటర్స్ – కూకట్‌ప‌ల్లి,

7. సంధ్య 70MM – ఆర్టీసీ ఎక్స్ రోడ్,

8. సంధ్య థియేటర్ 35MM – ఆర్టీసీ ఎక్స్ రోడ్,

9. రాజధాని డీలక్స్ – దిల్‌సుఖ్‌నగర్,

10. శ్రీరాములు థియేటర్ – మూసాపేట,

11. గోకుల్ థియేటర్ – ఎర్రగడ్డ,

12. శ్రీ సాయిరాం థియేటర్ – మల్కాజ్‌గిరి,

13. ఎస్ వి సి తిరుమల థియేటర్ – ఖమ్మం,

14. వినోద్ థియేటర్ – ఖమ్మం,

15. వెంకటేష్ థియేటర్ – కరీంనగర్,

16. నటరాజ్ థియేటర్ – నల్గొండ,

17. ఎస్ వి సి విజయ్ థియేటర్ – నిజామాబాద్,

18.వెంకటేశ్వర థియేటర్ – మహబూబ్‌న‌గర్,

19. శ్రీనివాస థియేటర్ – మహబూబ్‌న‌గర్,

20. రాధిక థియేటర్స్ – వరంగల్..

ఈ థియేటర్స్ ద‌గ్గ‌ర‌ 21 అర్ధ‌రాత్రి నుంచే స‌లార్ మాస్‌ జాత‌ర‌ మొదలవుతుంది.