పెద్ద స్కెచ్.. ఏ వేసి బిగ్ బాస్ 7 కప్పు కొట్టేసిన ఆ వ్యక్తి… రన్నర్ అప్ ఎవరంటే…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఇంతకు ముందు సీజన్లోతో పోలిస్తే భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ప్రేక్షకులని అలరించింది. ఇక ఈ షో ఫైనలిస్టులుగా ఉన్నవారు శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్దీప్, ప్రియాంక, అర్జున్ లు. ఇక వీరందరినీ లాస్ట్ వీక్ ఇంట్లోనే ఉంచి… ఫన్ టాస్కులు పెడుతూ ఎంటర్టైన్ చేశారు.

ఇక ఇదిలా ఉంటే నిన్నటి నుంచే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరగగా.. ఆదివారం ప్రసారం కానుంది. పలువురు హీరోయిన్లు, కంటెస్టెంట్లు డాన్సులతో హోరాహోరీగా సాగిన ఈ బిగ్ బాస్ షోలో రైతుబిడ్డ విన్నర్ అయినట్లు సమాచారం.

ఇక రన్నర పొచ్చి అమర్దీప్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఏమైనప్పటికీ రైతుబిడ్డ అనే ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కప్పు పట్టుకునే వచ్చాడుగా. ఈ సమాచారం చూసిన ప్రేక్షకులు..” పెద్ద ప్లాన్..ఏ వేసి బిగ్ బాస్ 7 విన్నర్ అయిపోయావుగా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.