నందమూరి కళ్యాణ్ రామ్ చివరిగా బింబిసారా, ఆమీగోస్ సినిమాలతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే గత ఏడాది నటించిన బింబిసారా సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ,50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి రికార్డుల్లోకి ఎక్కింది, ఇక ఈ ఏడాది మొదట్లో అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఈ మూవీలో 3 డిఫరెంట్ రూల్స్ లో కళ్యాణ్ రామ్ నటించినా కథలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తాపడ్డాడు. ఇక తాజాగా ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ నెల(డిసెంబర్) 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నామా అభిషేక్ దర్శక, నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజై సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను తెచ్చిపెట్టాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ జంటగా సంయుక్తమీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్రిటిష్ కాలం యాక్షన్స్ సన్నివేశాలు నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్‌రామ్ కనిపించబోతున్నాడట. దీంతో కళ్యాణ్ రామ్ లుక్, లైఫ్ స్టైల్ చాలా స్పెషల్ గా ఉండాలి అని.. అదేవిధంగా భారతీయత ఉట్టి పడేలా ఉండాలని ఉద్దేశ్యంతో కాస్ట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా ప్లాన్ చేశారట మేకర్స్. ఏకంగా ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ కోసమే 90 కాస్ట్యూమ్స్ వాడినట్లు తెలుస్తుంది.
ఇందులో కళ్యాణ్ రామ్ చాలా స్పెషల్ గా కనిపించేందుకు ఎన్నో రకాల డ్రెస్సింగ్ స్టైల్స్ లో చూపించాడట డైరెక్టర్. ఇటలీలో దొరికే మెహైర్ ఊలుతో దగ్గర దగ్గరగా 60 బ్లాజర్లను చేయించినట్లు తెలుస్తుంది. అలాగే దేశీ కాటన్ కుర్తితో దోతిని కూడా చాలా స్పెషల్ గా తయారు చేయించారట. ప్రత్యేకమైన 25 వేయిస్ట్ కోట్లను కూడా ఉపయోగించినట్లు టాక్. ఈ సినిమాల్లో కళ్యాణ్ రామ్ పెట్టుకునే వాచ్ ను ఢిల్లీలో పురాతన వస్తువులను సేకరించి ఓ వ్యక్తి దగ్గర తీసుకున్నట్లు సమాచారం. కేవలం ఆ వాజ్ ఖరీదే లక్షల్లో ఉంటుందట. ఇలా డెవిల్ సినిమా కాస్ట్యూమ్స్, ఇంకా వాచ్ కోసం కళ్యాణ్ రామ్ కి రూ.50 లక్షలవరకు ఖర్చు చేశారట.