ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి సంభందించిన విషయాఅన్ని ఎంతో గోప్యంగా ఉంచుతూ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు కొరటాల శివ. స్టోరీ లైన్ ఆనవాళ్లు కూడా బయటకు రానీయకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. అయితే ఇప్పుడు దేవర ప్రపంచాన్ని ఆడియోస్కు పరిచయం చేసే సమయం వచ్చింది. అని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే క్రిస్మస్ టైంలో దేవర గ్లింప్స్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలా గ్లింప్స్‌తో ప్రచారాన్ని ప్రారంభించి.. స్టెప్స్ వైస్‌గా దేవర సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని టాక్.
ఏప్రిల్ 5న దేవర మూవీ పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రచారం కూడా అదే రేంజ్ లో కల్పించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారతదేశంలో సముద్ర తీరంలో జరిగే ఓ కథను అంశాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తెరకెక్కిస్తున్నాడట కొరటాల. అయితే ఇప్పటికే ఈ మూవీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా కదా ఎలా ఉంటుంది.. ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే అంశానిపై క్లారిటీ ఇవ్వలేదు.
గ్లింప్స్‌తో ఆ క్లారిటీ ఇవ్వడానికి ప్లాన్ చేశారట. యువసేన ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ లను కూడా మూవీ టీం గతంలోనే రిలీజ్ చేశారు. వీలైతే సలార్, డుంకీ సినిమా ఇంటర్వెల్స్ లో కూడా దేవర గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కొరటాల హైప్ కోసం భలే మాస్టర్ స్కెచ్ వేశాడు అంటూ అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.