” నా కొడుకు అలా మాట్లాడితే నేను అస్సలు పట్టించుకోను “…. నాని సెన్సేషనల్ కామెంట్స్…!!

నాచురల్ స్టార్ నాని మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ప్రతి ఇంట్లో ఒకడిగా ఉండే నాని ప్రస్తుతం.. మరో కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు. నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రచారాలలో భాగంగా నాని తన గురించి.. తన తనయుడితో సంబంధం గురించి కామెంట్స్ చేశాడు.

పిల్లలంటే ఇష్టమని, ప్రయాణాలలో, విమానాశ్రయాలలో పిల్లలతో పెద్దలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ” నేను చూసుకోనా? ” అని దగ్గరికి తీసుకుంటాడట నాని. ఇక ఇందువల్లే పెద్ద వారిలో సైతం ” ఇతను మనవాడే ” అనే అభిప్రాయం కలుగుతుంది అంటూ నాని వెల్లడించాడు. ఇక హాయ్ నాన్న మూవీ కూడా ఈ క్రమంలోనే ఓకే చెప్పానని వెల్లడించాడు. తండ్రి కూతుర్ల అనుబంధంతో ముడిపడ్డ ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అంటూ నాని చెప్పాడు.

ఇక నాని తన కొడుకు గురించి మాట్లాడుతూ…” నా కొడుకుతో నేను చాలా ఫన్నీ గా ఉంటాను. వాడు కూడా నాతో చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఒక్కోసారి వాడు ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం నేను అస్సలు మాట్లాడను. ఎందుకంటే నాకు తెలుగు భాష మీద అభినయం ఉంది. నా పిల్లవాడికి నేను ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడమని అస్సలు చెప్పను ” అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.