water Apple: ఈ పండుతో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే.. త‌ప్ప‌కుండా రోజు తింటారు..

వాటర్ ఆపిల్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. ఊబకాయంతో బాధపడే వారికి వాటర్ ఆపిల్ చాలా సహకరిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాడీలో నీటి శాతాన్ని పెరుగుతుంది.దీంతో డిహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులోని గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ప్రిరాడికల్స్ నుంచి కాపాడతాయి.

షుగర్ పేషెంట్లకు కూడా వాటర్ ఆపిల్ చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ హైపర్గ్లైసిమిక్ లక్షణాలు బాడీలోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. రోజు వాటర్ ఆపిల్‌ని తినడం వల్ల రక్తపోటు సమస్య కూడా తగ్గుతుంది. అధిక రక్త‌పోటు సమస్య కు వాటర్ ఆపిల్ చెక్ పెడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వాటర్ యాపిల్‌ని తీసుకోండి. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. ఈ వాటర్ ఆపిల్ లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది.

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరగడానికి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే వాటర్ ఆపిల్ ప్రతిరోజు డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచారవ‌ని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల వాటర్ ఆపిల్ 93 గ్రాముల నీరు, 0.6 గ్రాముల ప్రోటీన్, 5.7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ , 1.5g ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి.