బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కత్రీనా కైఫ్, హాలీవుడ్ నటి మిచెల్లీకి సంబంధించిన టవల్ ఫైట్ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న ” టైగర్ 3 ” సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కత్రీనా కైఫ్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది.
ఆ ఇంటర్వ్యూలో కత్రీనా మాట్లాడుతూ.. ” నా కెరీర్ లోనే ఈ వార్డ్ రోజ్ ఫైట్ ఓ బిగ్ ఛాలెంజ్. మా టవల్స్ సరైన స్థానంలో ఉంచి మేము కదులుతూ ఫైట్ చేయడం అనేది ఛాలెంజ్ గా మారింది. మొదట్లో దీనిని సులభంగా చేస్తామని నవ్వుకున్నాం. కానీ షూట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. రెండు వారాల పాటు ప్రాక్టీస్ చేసి ఫైట్ నేర్చుకున్నాం. చాలా అద్భుతమైన సెట్ లో ఇలాంటి ఫైట్ చేయడం నిజంగా ఒక గొప్ప అనుభూతి ” అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కత్రీనా కైఫ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు… టవల్ కట్టుకోవడానికి బానే కట్టుకున్నారు కానీ… ఒక్కసారి టవల్ జారితే అంతే పరిస్థితి అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది టవల్ కట్టుకుని ఆ విధంగా ఫైట్ చేయడం చాలా గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram