ఆమె నాకు దొరకడం నా అదృష్టం… మీడియా ముందు ఎమోషనల్ అయినా నిర్మాత…!!

నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమ పెళ్లితో ఒకటైన ఈ జంటను చూసి ట్రోల్స్ చెయ్యని వారంటూ లేరు. అలాంటి ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత మంది విమర్శలు చేసిన మేము ఇద్దరం ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నామంటూ ఇద్దరు తెలిపారు. అయితే.. తాజాగా నిర్మాత రవీందర్ ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ. 15 కోట్లు మోసం చేసిన కేసులో రవీందర్ అరెస్ట్ అయ్యాడు. ఇక తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు. రవీందర్ మాట్లాడుతూ.. తనను కావాలని తప్పుడు కేసులో ఇరికించారని చెప్పాడు. అంతేకాకుండా తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ” నా భార్యే నాకు ముఖ్యం.

అమ్మ తర్వాత నా లైఫ్ లో మహాలక్ష్మి అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. మా ఇద్దరినీ ఎవరు విడదీయలేరు ” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఎవరు ట్రోల్స్ చేసిన, తిట్టుకున్న మమ్మల్ని అవేవీ విడదీయ లేవంటూ రవీందర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవీందర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.