కూరలో ఉప్పు ఎక్కువైతే చిటికెలో వాటిని ఇలా సెట్ చేయండి..!

ఈ బిజీ లైఫ్ లో ఉదయం లేచి లేవగానే లంచ్ బాక్స్, టిఫిన్లు, టీలు అంటూ హడావుడి హడావుడిగా వంటలు చేస్తూ ఉంటారు. పిల్లలు స్కూళ్లకు, పెద్ద‌వాళ్ళు ఆఫీసులకు వెళ్లాలని హడావిడిలో ఆడవారు వంటలు ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటారు. చాలా మంది ఉప్పు ఎక్కువ అయితే నిమ్మకాయ పిండుతారు. అయినా ఉప్పు తగ్గదు. దీంతో ఎవరు కూరను తినలేరు. బాక్స్ లో పెడితే బాగోదు. ఇక‌ ఏం చేయాలో అని ఆలోచిస్తూనే వాడిన కూరను పక్కన పెట్టి మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ లాంటిది చేసి బాక్స్ లో పెడతారు. ఇలా కాకుండా కూరలో ఉప్పు ఎక్కువ అయింది అనుకోండి ఈ సారి ఇలా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి కూరలకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. మరి ఇంకెందుకు లేట్ ఈ చిట్కాలు ఓసారి చూద్దాం

కొబ్బరి పాలు :


మీరు చేసే కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే ఒకసారి కొబ్బరిపాలు కలిపి చూడండి. కొబ్బరి పాలను కూరల్లో యూస్ చేస్తే ఉప్పు తగ‌డమే కాదు క‌ర్రీ టేస్ట్ గా కూడా ఉంటుంది. కొబ్బరిపాలు వేశాక కూరని సిమ్‌లో పెట్టి ఉడికించండి. సింపుల్ ఇలా ఈజీగా ఉప్పు తగ్గుతుంది. మరో విషయం ఏంటంటే కొబ్బరిపాలు చిక్కగా ఉండేలా చూసుకోండి.

బంగాళదుంప :


ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కూరలో ఉప్పు ఎక్కువ అయింది అని కంగారు పడకుండా కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే గనక బంగాళాదుంపల్ని ఉడికించి కూరలో కలిపేయండి. కూరలో ఉన్న ఉప్పు ఆలు పీల్చుకుంటుంది. దీంతో కూరలో సాల్ట్ నార్మల్ గా అవుతుంది. ఇలా చేయడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది.

గోధుమపిండి :


ఉప్పు తగ్గించేందుకు ఇది కూడా బాగా పనిచేస్తుంది. గోధుమ పిండితో కూడా ఉప్పును తగ్గించొచ్చు. కొద్దిగా గోధుమపిండిని గిన్నెలో వేసుకుని నీళ్లు పోసి ఉండలుగా చేసుకోవాలి.ఆ ఉండలు వేసాక కూరని వేడి చేయకూడదు. కూరలో ఉన్న ఉప్పు అంత గోధుమపిండి ఉండలు పీల్చేస్తాయి.

ఉల్లిపాయ లేద టమాట :


కూరలో ఉప్పు ఎక్కువైతే టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఉల్లిపాయ లేదా టమాటాలు ముందే నూనెలో వేసి బాగా వేయించుకొని వాటిని మిక్సీ పట్టి కూరలో వేసి బాగా ఉడకనివ్వండి. ఇలా చేస్తే ఉప్పు తగ్గడమే కాదు క‌ర్రీ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా సింపుల్ చిట్కాలతో కూరలో ఉప్పును తగ్గించి రుచిగా మార్చుకోవచ్చు.