” ది వ్యాక్సిన్ వార్ ” మూవీ పై స్పందించిన ప్రధాని మోదీ.. కామెంట్స్ వైరల్..

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన రీసెంట్ మూవీ ది వ్యాక్సిన్ వార్. వ్యాక్సిన్ సిద్ధం చేసిన సంఘటనల ఆధారంగా దీనిని తర్కెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ్ సైంటిస్ట్ రోల్ ను ప్లే చేసింది. ఆమెతో పాటు నానాపటేకర్, పల్లవి జోష్, రైమా సేన్, అనుపమ ఖేర్, నివేదిత బట్టచార్య తదితరులు కీలకపాత్రలో నటించారు.

ఇక తాజాగా జోధాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మోడీ ది వ్యాక్సిన్ వార్ సినిమా ప్రస్తావన తీసుకువచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ది వ్యాక్సిన్ వార్ అనే మూవీ వచ్చిందని విన్నాను.. భారతదేశంలో కోవిడ్ పై పోరాటంలో మన శాస్త్రవేత్తలు ఆహారాత్రులు కష్టపడి లాబ్‌లో ఋషుల లాగా సాధించిన విజయాలను.. ముఖ్యంగా మన మహిళా శాస్త్రవేత్తల విజయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.

మన శాస్త్రవేత్తలు ఇంత అద్భుతమైన పని చేశారని ఆ మూవీ చూసిన ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. చంద్రయాన్‌ మన శాస్త్రవేత్తలపై గౌరవం పెరిగింది. వాక్సిన్ అభివృద్ధి చేసిన మన శాస్త్రవేత్తలను అందరూ గౌరవిస్తున్నారు. దేశ యువత సైన్స్ పట్ల, శాస్త్రవేత్తల పట్ల ఆక‌ర్షితులు అవుతున్నారు దీనికి నేను చాలా గర్విస్తున్నాను అంటూ మోడీ చెప్పుకొచ్చాడు. అలాగే ది వ్యాక్సిన్ వార్ సినిమాని తెర‌కెక్కించిన టీమ్‌ని కూడా ఆయన ప్రశంసించాడు. ప్రస్తుతం మోడీ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.