తెలుగు సినిమా ఇప్పుడు రీజినల్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా. ఆ రేంజ్ లోకి వెళ్ళింది మన టాలీవుడ్. తెలుగు సినిమా వస్తుందంటే చాలు మిగతా ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతుంది. అంతేకాదు మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్:
ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే పారిదోషకం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ దగ్గర టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం 150 కోట్లు వరకు అందుకుంటున్నారని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే, స్పిరిట్, సలార్ వంటి సినిమాలలో బిజీగా ఉన్నాడు.
పవన్ కళ్యాణ్:
పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలో నటించాడు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది. హరిహర వీరమల్లుకు రూ.60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మిగిలిన సినిమాలుకు కూడా రూ.50 కోట్లు అందుకుంటున్నాడట పవన్.
మహేష్ బాబు:
సర్కార్ వారి పాట సినిమాకు గాను మహేష్ బాబు రూ.60 కోట్లు తీసుకున్నారు అని వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. పైగా ఈ సినిమాకు ఈయన నిర్మాణంలో భాగం కూడా.. ఈ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి తో సినిమా ఉండనుంది. రాజమౌళి సినిమాకు మహేష్ రూ.80 కోట్లు వరకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి కూడా రూ.50 కోట్లు వరకు అందుకుంటున్నారని టాక్. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ డిజాస్టర్ తరువాత వశిష్ఠ మల్లిడితో ఓ ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన రూ60 కోట్లు పైనే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
బాలకృష్ణ:
అఖండ కోసం బాలయ్య రూ.11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా రూ.70 కోట్ల వసూళ్లు చేసిన నేపథ్యంలో రూ.15కోట్ల వరకు పారితోషకం పెంచినట్లు తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరాకు విడుదల కానుంది.
అదేవిధంగా ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరోస్ గా మారిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్ రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఇక ఇతర హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, సాయిధర్మతేజ్, నాగార్జున, వెంకటేష్, నాని, శర్వానంద్, నితిన్, నాగచైతన్య, రామ్ పోతినేని వీరి రెమ్యునరేషన్ కూడా లక్షల్లో ఉంది.