సహజంగా చాలామంది దానమ్మ కాయను ఇష్టపడతారు. ఆ ఇష్టంతోనే గింజలను తింటారు కానీ తొక్కను మాత్రం పడేస్తూ ఉంటారు. మరి దానిమ్మ తొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్క లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. దీని ద్వారా చక్కటి చర్మ సౌందర్యాన్ని పొందే అవకాశం ఉంది.
దానిమ్మ తొక్క దెబ్బతిన్న చర్మ కణాలను సరి చేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. చర్మం పొడిబారకుండా హైడ్రేట్ చేస్తుంది. అకాల వృద్ధాప్య సంకేతాలను, ముడతలను తగ్గిస్తుంది. పలు రకాల చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. మొటిమలు తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దానిమ్మ తొక్క గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది.
అది ఎలా తయారు చేసుకోవాలంటే… ముందుగా దానిమ్మ తొక్కలను తీసుకుని.. మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత దానిని పేస్ట్ లా చేసుకుని.. అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మొఖం అందంగా తయారవుతుంది.