ఇండస్ట్రీలో మరో డివోర్స్.. యువ దర్శకుడి పెళ్లి విఫలం..!

ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం డివర్స్ తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. పారాణి ఆరకముందే విడాకులు అంటూ భార్యాభర్తలు దూరం అవుతున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లోని ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇటీవల వివాహ జీవితంలోకి అడుగు పెట్టాడు. కానీ వారి జీవితం కూడా ఇలాగే ముగిసిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. పెళ్లి జరిగి ఎంతో కాలం కాలేదు. సూపర్ హిట్ కొట్టిన సంబరం, ఆపై పెళ్లి చేసుకున్న ఆనందం, మళ్లీ మరో భారీ సినిమా చేతిలోకి వచ్చింది.

కానీ ఇప్పుడు విడాకులు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటో ఈ జనరేషన్ అనుకోవాలో..? అభిప్రాయాలు కలవక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవాలో..? అర్థం కావడం లేదు. దాదాపు నెలరోజులుగా ఈ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి సన్నిహితులు ఎవరిని అడిగిన అబ్బే అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం మాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరి మధ్య విడాకులు కన్ఫ‌ర్మ్ అయ్యాయి అంటూ న్యూస్ బలంగా వినిపిస్తుంది.

టాలీవుడ్ లో చాలామందితో ఈ దర్శకుడికి సాహిత్యం ఉంది. పైగా అతని కుటుంబం కూడా టాలీవుడ్ లోని పలువురితో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. పెళ్ళై ఏడాది పూర్తి అయిందో లేదో ఇక ఈ గాసిప్‌ వినిపిస్తున్న నమ్మడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు అదే నిజమని వార్తలు చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎవరా యంగ్ డైరెక్టర్..? అనే చర్చ నేటిజన్‌ల‌లో స్టార్ట్ అయింది.