తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతోంది. తొలి వారంలోని అంతా గందరగోళంగా మారిపోయింది. ఆడియన్స్ నుంచి దాదాపు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సీజన్ లో హౌస్ లో జరిగిన ప్రేమాయణాల కారణంగా చాలా మంది బిగ్ బాస్ ను తిట్టి పోశారు. కొంతమంది అయితే ఏకంగా బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ప్రస్తుతం అదే తరహాలో ఈ సీజన్ కూడా నడుస్తుందని.. హౌస్ లో రోజురోజుకీ గాఢ ప్రేమికలుగా మారుతున్న రతిక, పల్లవి ప్రశాంత్‌లకు బిగ్‌బాస్ మధ్యవర్తిగా ఉన్నాడు అంటున్నారు. ప్రశాంత్ గుండె ఏమని కొట్టుకుంటుందో చెక్ చేయాలనీ బిగ్ బాస్ రతికని ఫన్నీగా అడగడం ఏంటి..? కంటి స్టెంట్స్ దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో బిగ్ బాస్ మీడియేటర్‌గా చులకన అయిపోయారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
బిగ్ బాస్ చెప్పగానే రతిక స్టెతస్కోప్ ను ప్రశాంత్ గుండెపై పెట్టడం, రతిక రతిక అని కొట్టుకుంటుంది అంటూ రతిక బిగ్ బాస్ కు రొమాంటిక్‌గా చెప్పడం.. మరోసారి రతిక, ప్రశాంత్ హార్ట్ బీట్‌ను చెక్ చేసి అతడి గుండె కొట్టుకోవట్లేదు.. ఎందుకంటే అతడి గుండె నా దగ్గర ఉంది అంటూ ప్రేమ కబుర్లు చెప్పడం.. ఇందులో బిగ్ బాస్ మధ్యలో దూరి ఎక్కువగా సెటైర్లు వేయడం, అలా చేయండి, ఇలా చెయ్యండి అని చెప్పడం ఏంటి? అని నెటిజెన్స్ బిగ్‌బాస్‌పై మండిపడుతున్నారు.