బేబీ హీరోయిన్‌పై ఆఫర్ల వర్షం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..!

బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ప్రశంసలను అందుకుంది. తనదైన నటనతో కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న వైష్ణవి ఈ సినిమాతో త‌న స‌త్తా చాటింది. ఇక ఈ సినిమా స‌క్స‌స్‌తో 4,5 సినిమాల అవకాశాలను కూడా ద‌క్కించుకుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్ల వర్షం కురుస్తుందట. వాటిలో పూరి జగన్నాథ – రామ్ పోతినని కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ 2 ఆఫర్ కూడా ఒకటని సమాచారం.

రామ్ పోతినని ఆమెకు విషెస్ చెప్తే సర్ప్రైజ్ గా బొకే పంపించడంతోపాటు పూరి నుంచి కూడా నీకు నాసినిమాలు ఆఫర్ వస్తుందని హామీ వచ్చిందట. ఇదే నిజమైతే వైష్ణవి హీరోయిన్గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. ఇక ఇదే కాకుండా గీత ఆర్ట్స్ లో మరో సినిమాకు వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఓకే అయ్యిందట. అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున‌ ఈ సినిమాలో వైష్ణవి ఓకే చేశారట‌. దీనికి సాయి రాజేష్ కారణమని న్యూస్ వైరల్ అవుతుంది. బేబీ డైరెక్టర్ గీతా ఆర్ట్స్ సంబంధించిన మనిషే కాబట్టి ఆయన చెబితే పని అయిపోతుంది.

అంతేకాదు మరో రెండు ఆఫర్లను కూడా సాయి రాజేష్ ఇస్తానని వైష్ణవికి భరోసా ఇచ్చాడట. దీంతో పాటు ఇటీవల మరో రెండు ఆఫర్లు ఈ బ్యూటీకి వచ్చాయట. దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా కమిట్ అయిందని సమాచారం. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ తో మూవీ చేయబోతున్నారు. ఇప్పటికే ఆశిష్ హీరోగా రౌడీ బాయ్ సినిమాలో నటించాడు. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ దిల్ రాజు బ్యానర్ లో అరుణ్ భీమవరపు డైరెక్షన్లో ఓ సినిమాలు నటిస్తున్నాడట.

ఇందులో హీరొయిన్‌గా వైష్ణవి ఫిక్స్ అయినట్లు సమాచారం. సిద్దు జొన్నలగడ్డ సరసన మరో సినిమాలో హీరోయిన్గా నటించబోతుందంట వైష్ణ‌వి. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ష‌న్‌లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇవే కాక ఇంకా కొన్ని సినిమాలు చర్చలు దశలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఫైనలైతే వైష్ణవి పంట పండిన‌ట్టే.