కళ్ళ మధ్య, ముక్కుకు ఇరువైపులా, నుదుటి వెనుక, మెదడుకు దగ్గర్లో ఇలా ముఖంలో 4 జతల గాలి గదులుంటాయి. ఈ గదులన్నీ ముక్కు గోడల్లోకి తెరుచుకుని ఉంటాయి. తలనొప్పి, ముక్కు నుంచి చిక్కని ద్రవం కారడం, ముక్కు దిబ్బడ, పొడి దగ్గు, ముక్కు వెనక భాగంలో స్రావం దిగుతున్నట్టు అనిపించడం.. దీనికి తోడు చిరాకు. ఇవన్నీ అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు. ఈ పరిస్థితి ముదిరితే దానిని వైద్య పరి భాషల్లో క్రానిక్ సైనసైటిస్ అంటారు. అయితే దీనిలో తలనొప్పి ఉండదు. మొఖం మధ్య భాగంలో నొప్పి, ముఖం బరువుగా ఉండటం అనిపిస్తుంది.
ఏడాదిలో ఒకటికి నాలుగు సార్లు అక్యూట్ సైనసైటిస్ గురవుతూ ఉంటే అది క్రానిక్ సైనసైటిస్ గా మారుతుంది. నేసల్ ఎండోస్కోపిక్ పరీక్షతో సైనసైటిస్ తీవ్రతను అంచనా వేయవచ్చు. అక్యూట్ సైనసైటిస్ యాంటీబయోటిక్ మందులతో సరి చేసుకోవచ్చు. ఈ మందులను 10 నుంచి 14 రోజులపాటు వాడాల్సి ఉంటుంది. దీనితోపాటు ఎలర్జీని అరికట్టే యాంటీహిస్టమిన్లు కూడా వాడాల్సి ఉంటుంది.
అలాగే మ్యూక్సను కరిగించే డీకంజెస్టెంట్లు కూడా వాడాలి. నెసల్ డ్రైనేజీలను తెరవడం కోసం రోజుకు రెండు సార్లు చొప్పున వారం రోజుల పాటు నేసల్ స్ప్రేలు కూడా వాడాలి. అలాగే అక్యూట్ సైనసైటిస్ కు సోడియం బైకార్బొనేట్, ఉప్పు, గోరువెచ్చని నీటిలో కలిపి, ఆల్కలైన్ నేసల్ డూషెస్ తయారుచేసుకుని, ముక్కు శుభ్రం చేసుకోవలి. అలర్జీతో సైనసైటిస్‌కు గురవుతున్న వాళ్లు కార్టికోస్టిరాయిడ్ నేసల్ స్ర్పేలు, యాంటి హిస్టమిన్ నేసల్ స్ర్పేలు వాడాలి.