మోనితకు పోటీగా వంటలక్క బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. మరి డాక్టర్ బాబు ఎంట్రీ ఎప్పుడో..!!

తెలుగు ‘ బిగ్ బాస్ సీజన్7 ‘ ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో శోభా శెట్టి అలియాస్ మోనిత ఒకరు. కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక ఈ సీరియల్ లో వంటలక్క దీప.. మోనితకు మధ్య ఎలాంటి గొడవలు ఉండేవో మనం చూశాం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా శోభా శెట్టి సీరియల్‌లో మాదిరిగానే తన నిజ జీవితం చూపిస్తుంది. దీంతో నెటిజెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు గట్టి పోటీ ఇవ్వాలంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వంటలక్కను కూడా బిగ్ బాస్ లోకి పంపించాలని… అప్పుడు షో మరింత రసవక్తంగా సాగుతుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

బుల్లితెరపై సంచలనాలు సృష్టించే షో గా ‘ బిగ్ బాస్ ‘ కి పేరు ఉంది. నార్త్ లో పాపులర్ అయిన ఈ షో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగ్గుసాయి. ఇప్పుడు బిగ్ బాస్ 7 కూడా మొదలైంది.. హౌస్, కొత్త కొత్త టాస్క్‌ల‌తో బిగ్ బాస్ 7 ఉల్టా పల్టాలా ఉంటుందని నాగార్జున చెప్పినట్టే షో కూడా అలాగే నడుస్తుంది. టాస్కులు కూడా మొదలయ్యాయి.