పవన్ – రవితేజ కాంబోలో కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ మహారాజు రవితేజ వీరిద్దరికి టాలీవుడ్లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారంటూ న్యూస్ వైరల్ అవుతుంది. విక్రమ్ వేదా హిందీ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుందట. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవితో కలిసి వాల్తేరు వీర‌య్య మూవీలో నటించిన రవితేజ ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు.

ప్రస్తుతం రవితేజ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాల షూటింగ్లతో పాటు పాలిటెక్ మీటింగ్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని న్యూస్ వైరల్ కావడంతో మెగా అభిమానులతో పాటు రవితేజ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

ఈ సినిమాకు సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారని, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కాంబో మూవీ కి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా అనౌన్స్‌ చేయబోతున్నారట మూవీ టీం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.