తెలుగు బిగ్ బాస్ లోకి ఊహించని స్టార్ హీరో.. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ వెనక..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారిలో సీనియర్ హీరో శివాజీ కూడా ఒకరు. కెరీర్ మొదటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. శివాజీ మిస్సమ్మ, ప్రియమైన నీకు, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియనేస్తం, ప్రేమంటే ఇదేరా, అదిరిందయ్యా చంద్రం వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటారు.

ఇక అదే విధంగా జల్సా సినిమాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలుకు దూరంగా ఉంటున్న శివాజీ రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా ఉన్నారు అయితే ప్రస్తుతం రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నాడు.

 

ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరో నాగార్జున హోస్టుగా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వస్తున్నట్లు ప‌లు వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.